వాడుకలోకి రానున్న బాచారం వంతెన : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

Published: Tuesday July 12, 2022
వికారాబాద్ బ్యూరో జూలై 11 ప్రజా పాలన : త్వరలో బాచారం వంతెనను వాడుకలోకి తేనున్నామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం ధారూర్ మండల పరిధిలోని బాచారం గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న వంతెన పనులను మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజు నాయక్ ఏఎంసీ చైర్మన్ ముచ్చర్ల సంతోష్ కుమార్ గుప్తా మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కావలి అంజయ్య ముదిరాజ్ మండల రైతు సంఘం అధ్యక్షుడు రుద్రారం వెంకటయ్య ముదిరాజ్ మండల టిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కోస్నం వేణుగోపాల్ రెడ్డి లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హితువు పలికారు. వికారాబాద్ నుండి తాండూర్ వెళ్లే రోడ్డులో బాచారం వంతెన నిర్మాణం పూర్తి కానున్నదని పేర్కొన్నారు. తాత్కాలికంగా వేసిన రోడ్డు వరద నీటికి కొట్టుకొని పోయిందని స్పష్టం చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా మళ్ళీ ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు ఏర్పాటును పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న వంతెనను మరికొద్ది రోజుల్లో వాడుకలోకి తీసుకొస్తామన్నారు.