ఆపరేషన్ ముస్కాన్-08 విజయవంతం ** జిల్లా ఎస్పీ సురేష్ కుమార్

Published: Tuesday August 02, 2022

ఆసిఫాబాద్ జిల్లా ఆగస్టు 01 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లా వ్యాప్తంగా బాలలకు హక్కులను కల్పించడానికి ఆపరేషన్ ముస్కాన్-08 బృందం, జూలై 01నుండి, 31 వరకు చేసిన రెస్క్ ఆపరేషన్ కృషి ఫలించిందని, జిల్లా ఎస్పీ కె సురేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో రెండు డివిజన్లలో కలిపి మొత్తం 52 మంది బాలబాలికలను గుర్తించినట్లు తెలిపారు. ఆసిఫాబాద్ డిజన్ లో 26 మంది, కాగజ్ నగర్ డివిజన్ లో 26మంది, ఇందులో 49 మంది బాలురు కాగా,3 బాలికలు ఉన్నారన్నారు. ఒకరు మహారాష్ట్ర బాలుడు గా గుర్తించినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్లో పోలీస్, రెవిన్యూ, కార్మిక శాఖ, బాలల సంరక్షణ అధికారులు, భాగస్వాములయ్యార ని తెలిపారు. జిల్లాలో ఉన్న కార్మికులను గుర్తించి బడిలో నేర్పించేలా కృషి చేశారని అన్నారు. బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ముస్కాన్-08 ఈ కార్యక్రమానికి ఆసిఫాబాద్ డివిజన్ ఇన్చార్జిగా ఎస్సై సాగర్, కాగజ్ నగర్ ఇంచార్జ్ ఎస్ఐ అబ్దుల్ ఖాదర్ లు వ్యవహరించారని తెలిపారు.