చిన్న చెరువులో వాకింగ్ ట్రాక్ నిర్మించవద్దని రైతుల ఆందోళన

Published: Thursday December 02, 2021
ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 01 ప్రజాపాలన ప్రతినిధి : పట్నం చిన్న చెరువులో 72,73 సర్వేనెంబర్ లో 47 ఎకరాల  భూమిని భూములలో వాకింగ్ ట్రాక్ నిర్మించవద్దని, తమకు ఎఫ్ టి ఎల్  పట్టాలు అందజేయాలని ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతు నాయకుడు ముత్యాల రాజశేఖర్ రావు మాట్లాడుతూ గత వందల ఏళ్ళ క్రితం నుండి ఇక్కడ మా తాత, ముత్తాతలు వ్యవసాయం చేసి పంట పండించేవారని, ఇట్టి భూములకు గతంలో కూడా భూమి శిస్తూ చెల్లించామని ఆ రసీదులు, దానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. వ్యవసాయానికి అనువుగా ఉన్న ఈ చెరువు ఎఫ్టీఎల్ భూములలో వాకింగ్ ట్రాక్ పార్క్ నిర్మించడం వల్ల తమ భూములను కోల్పోతామని, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ వాకింగ్ ట్రాక్ నిర్మించడానికి ఒప్పుకోమని, అదేవిధంగా ప్రభుత్వం రైతుల మీద దయ చూపి తమకు ఎఫ్టీఎల్ పట్టాలు ఇప్పించాలని కోరారు. ప్రభుత్వం నుండి మాకు సరైన సమాధానం రాకుంటే భవిష్యత్తులో తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు ముత్యాల అశోక్, రాజేందర్, మహేందర్, సంతోష్, ముత్యాల బాలరాజు, ముత్యాల యాదయ్య, బుద్ధి జైహింద్, ఏసుదాస్, బుద్ధి దీపక్ ముత్యాల శ్రీరాములు, వెంకటేష్, నరసింహ్మ, రాజమణి యాదగిరి, పాండు, సంతోష్, లింగం, హరీష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.