తెలంగాణ విద్యా రంగం పట్ల కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్న

Published: Friday February 03, 2023
నరేంద్ర మోడీ.ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు మడుపల్లి లక్ష్మణ్ మధిర ఫిబ్రవరి 2 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీీ పరిధిిలో గురువారం నాడువిభజన హామీచట్టం ప్రకారం తెలంగాణకి రావాల్సిన విద్యాసంస్థలను ఒక్కటి కూడా కేటాయించలేదు.ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం.ఏఐఎస్ఎఫ్ మధిర నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో బడ్జెట్ కేటాయింపులకు నిరసనగా మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాల  ముందు కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్బంగా  లక్ష్మణ్ మాట్లాడుతూ.నిర్మల సీతారామన్  ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు బీజేపీ ప్రభుత్వం విద్య కాషాయీకరణ చేసే విధంగా కుట్ర చేస్తుందని, నూతన జాతీయ విద్యా విధానం ద్వారా విద్య కార్పోరేటీకరణ, కాషాయీకరణ చేసే విధంగా అడుగులు వేయడం శోచనీయం. తెలంగాణ రాష్ట్ర విభజన హామీల్లో ఉన్న విద్యాసంస్థలను తెలంగాణకి కేటాయించకుండా మోడీ ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. యూనివర్సిటీల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించక పోవడం ఎంత వరకు సమంజసం అని,తెలంగాణకు సంబంధించి విభజన హామీలో ఉన్న ట్రిపుల్ ఐటీ, జిల్లాకొక కేంద్రీయ విశ్వవిద్యాలయం, జిల్లాకొక నవోదయ పాఠశాల, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయకుండా బడ్జెట్ పెట్టడం తెలంగాణ విద్యారంగంపై బీజేపీ ప్రభుత్వం తన కుట్రను వెల్లడించింది. విద్యను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నదని, దేశంలో ఉన్న యూనివర్సిటీలను అభివృద్ధి చేయకుండా,దేశంలోకి విదేశీ యూనివర్సిటీలను ఆహ్వానిస్తూ, ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. విద్యారంగంలో సంస్కరణల పేరుతో శాస్త్రీయ విద్యావిధానాన్ని పాతరేసి పాఠ్యాంశాల్లో మతపరమైన అంశాలను చేరుస్తూ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్స్, ఫెల్లోషిప్స్ , మౌలానా ఆజాద్ ఉపకార వేతనాలు, ఇవ్వకుండా ఎగ్గొట్టి కార్పొరేట్ కంపెనీలకు దోచి పెట్టే విధంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఢిల్లీలో పార్లమెంటులో తెలంగాణ విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీయాలని, గుజరాత్ గులాంలకు బానిసలుగా ఉండి, తెలంగాణకి  ద్రోహులుగా బీజేపీ ఎంపీలు ఉన్నారని, కేంద్ర ప్రభుత్వం విద్యలో 10 శాతం నిధులు కేటాయించాల్సిన కేవలం 2.6% నిధులు మాత్రమే కేటాయిస్తూ విద్యారంగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ఈ బడ్జెట్లో విద్యకు సంబంధించినటువంటి వాటిపై జీఎస్టీ ఎత్తివేయకుండా అదనపు భారం మోపడం దుర్మార్గం. తక్షణమే కేంద్ర ప్రభుత్వం విద్యా రంగానికి అధిక నిధులు కేటాయించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారుఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మధిర డివిజన్ నాయకులు సాయి వెంకట్ విగ్నేష్ మండల నాయకులు కిరణ్ క్రాంతి. స్వాతి అనిత మౌనిక కీర్తన దివ్య   తదితరులు పాల్గొన్నారు.