*ప్రధానమంత్రి ఆరోగ్య భీమా పేద ప్రజలకు రక్ష* -ప్రతి కుటుంబానికి ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం -కం

Published: Monday March 13, 2023
చేవెళ్ల మార్చి 12(ప్రజాపాలన):-
కేంద్ర ప్రభుత్వం నిరుపేదల కోసం పనిచేస్తుందని కందవాడ ఉపసర్పంచ్ గౌండ్ల కావ్యకృష్ణ గౌడ్, మండల కార్యదర్శి అత్తిలి అనంతరెడ్డి అన్నారు.
చేవెళ్ల మండల పరిధిలోని కందావాడ గ్రామంలో ఆదివారం గ్రామ ఉప సర్పంచ్ గౌండ్ల కావ్య కృష్ణ గౌడ్ అధ్వర్యంలో గ్రామ ప్రజలందరికీ ప్రధాన మంత్రి అరోగ్య బీమా పథకం క్రింద గ్రామస్తులు అందరికి ఇన్సూరెన్స్ చేపియడం జరిగిందనీ గ్రామంలోని కొన్ని కంప్యూటర్లను ఏర్పాటు చేసి ఇన్సూరెన్స్ సభ్యత్వలను చేసి పత్రాలను గ్రామ ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... అర్దికంగా వెనుకబడిన నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. ఈ పథకం ద్వారా  ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల వరకు వైద్య సేవలను ఉచితంగా పొందవచ్చని,దేశంలో ఎక్కడైనా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో లబ్ధిదారులు ఉచితంగా వైద్య సేవలను పొందవచ్చు అని తెలిపారు. కావున ప్రతి ఒక్కరు
ప్రధాన మంత్రి అరోగ్య బీమా పథకం లో ప్రతి ఒక్కరూ భీమ చేసుకోవాలనికోరారు. కేంద్ర ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతుందని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ పలమకుల రవీందర్, బీజేపీ గ్రామ కమికి అధ్యక్షులు గుర్రాల శ్రీపాల్ రెడ్డి, శేరి బల్ రెడ్డి,ఎం నరేష్, గుర్రాల మహేశ్వేర రెడ్డి, కేశపల్లీ మహేందర్, చాకలి నవీన్,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.