లిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే సెలెబ్రేషన్స్

Published: Saturday July 02, 2022

ఇబ్రహీంపట్నం జులై తేదీ 1 ప్రజాపాలన ప్రతినిధి.

ప్రజా ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న వైద్యులందరికీ  డాక్టర్స్ డే శుభాకాంక్షలు అని లిమ్స్ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ రాంరాజు , డాక్టర్ విశ్వనాథ్ డాక్టర్ దినేష్ అన్నారు.శుక్రవారం లిమ్స్ హాస్పిటల్ ఆవరణలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు..
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ప్రజలందరికి మంచి వైద్యం అందిస్తూ అందరికి నిత్యం అందుబాటులో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామీణ ప్రాంతంలో  ప్రజలు అందరికి మంచి వైద్యం అందిస్తున్న లిమ్స్ హాస్పిటల్ అని,ప్రజలందరికీ మరిన్ని వైద్య సౌకర్యాలు కల్పించే విధంగా హాస్పటల్లో మరిన్ని సౌకర్యాలు  కల్పిస్తామని  సందర్భంగా నిర్వాకలు తెలిపారు.
వైద్యం అంటే ఓ వృత్తిగా కాకుండా మనుషుల్ని బ్రతికించే ఓ మహాశక్తిగా ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులకు లిమ్స్ హాస్పిటల్లో  జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు సందర్బంగా లిమ్స్ హాస్పిటలో కేక్ కట్ చేసి వైద్యుల అందరికి   సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో లిమ్స్ హాస్పిటల్ డాక్టర్స్ ,నరేష్, ఆనంద్,
తేజ,అబిలాష్,హాస్పిటల్ మేనేజర్ కాలే బాషా,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.