శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ప్రత్యేకపూజలు

Published: Saturday March 13, 2021

క్యాతన్పల్లి, మార్చి12, ప్రజాపాలన : క్యాతన్పల్లి పురపాలక సంఘం రామకృష్ణాపూర్ పట్టణంలో శివరాత్రిని పురస్కరించుకొని శుక్రవారం  రెండో వార్డు కౌన్సిలర్ పుల్లారి సుధాకర్ ఆలయానికి విచ్చేసి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ పూజారి రాజశేఖరనందస్వామి గణపతి పూజ, హెూమములు నిర్వహించారు. పలువురు భక్తులు భజనలు చేశారు. శుక్రవారం తెల్లవారుజాము పలు పూజలు నిర్వహించి అగ్నిగుండంలో పూజారి నడవడంతో పాటు భక్తులు పెద్ద ఎత్తున అగ్నిగుండంలో నడిచి శివనామస్మరణలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.