నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం

Published: Thursday July 07, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో జూలై 06 ప్రజా పాలన :  రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి మంచి విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో జిల్లాలో యస్ సి, యస్ టి. బి సి, మైనారిటీలకు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి అన్ని మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. బుధవారం స్థానిక డిపి ఆర్ సి భవనములో విద్యా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ విద్యాలయ పురస్కార ప్రధానోత్సవము మరియు పదవ తరగతి - 2022 వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు, వంద శాంతం ఫలితాలు సాధించిన పాఠశాలల ప్రాధనోపాధ్యాయులకు సన్మాన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొని విద్యార్థులకు, ప్రధాన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు మరియు ప్రతి ఒక్కరికి మంచి విద్యను అందించాలనే ఉద్యేశ్యంతో జిల్లాలో యస్ సి, యస్ టి, బి సి మరియు మైనారిటీ లకు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి, అన్ని మౌలిక సదుపాయములతో మంచి విద్యను అందించడం జరుగుతుందన్నారు.  విద్యార్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మునుముందు కూడా మంచి ఫలితాలు సాధించి ఉన్నత విద్యను అభ్యసించాలన్నారు.  ఈ సందర్బంగా పదవ తరగతిలో 10 జిపిఎ సాధించిన 46 మంది విద్యార్థులకు మరియు వంద శాంతం ఫలితాలు సాధించిన పాఠశాలలకు చెందిన 24 మంది ప్రధాన ఉపాధ్యాయులకు శాలువాలు, సర్టిఫికెట్లు, మెమొంటోలతో ఘనంగా సన్మానించారు.  అంతకు ముందు జ్యోతి ప్రజ్వలన గవించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి రేణుకదేవి, జిల్లా రెవిన్యూ అధికారి విజయకుమారి, షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ అధికారి మల్లేశం, గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజి, బిసి సంక్షేమ శాఖ అధికారి ఉపేందర్, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి సుధారాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.