నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ....పెద్దపల్లి డీసీపీ రూపేష్ .

Published: Thursday September 22, 2022
ప్రజాపాలన బ్యూరో, సెప్టెంబర్ 21, పెద్దపల్లి:
 
నేరాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ కోసం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని పెద్దపల్లి డీసీపీ రూపేష్  అన్నారు. బుధవారం   పెద్దపల్లి జోన్ ఏన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నపూర్ణ కాలనీ, భీముని పట్నం ప్రాంతం లో  గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్, పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి లతో కలిసి  ఆకస్మికంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం  నిర్వహించారు. ఈ సందర్భంగా  ఇతర రాష్ట్రాల నుంచి , ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు ఆరు వందల మంది
కార్మికుల వ్యక్తిగత వివరాలు సేకరించారు. వారిని పేస్ రికగ్నిషన్ సిస్టం యాప్ ద్వారా,  వేలిముద్రలు తీసుకొని  గతంలో ఏదైనా నేరాలు ఉన్నాయా అనే విషయాన్ని చెక్ చేశారు.వారు నివాసం ఉండే ఇళ్లను, చుట్టూ ప్రక్కల ప్రాదేశాలలో  సోదాలు చేశారు. వారి వద్ద ఉన్న వాహన పత్రాలు తనిఖీ చేశారు.ఈ సందర్భంగా డీసీపీ రూపేష్  మాట్లాడుతూ   ప్రజల రక్షణ, ప్రజలకు భద్రత భావం, సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి , ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం పై ఆరా తీయడం జరుగుతుందని తెలిపారు.  చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్లు రమేష్ బాబు, రాజ్ కుమార్, గోదావరిఖని టూ టౌన్ ఇన్స్పెక్టర్ అబ్జాలోద్దీన్ , మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ , సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ జీవన్, సబ్ డివిజన్ ఎస్ఐ లు, స్పెషల్ పార్టీ సిబ్బంది పోలీస్ హెడ్ కానిస్టేబుల్ , కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు.