మహిళల ఆరోగ్య రక్షణ తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం మధిర మునిసిపల్ చైర్ పర్సన్ మొండితోక లత

Published: Tuesday March 14, 2023
మధిర, మార్చి 13 ప్రజాపాలన ప్రతినిధి: మున్సిపాలిటీ కార్యాలయంలో నందు సోమవారం ఆరోగ్య రక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది.మహిళా దినోత్సవ వారోత్సవాలు పురస్కరించుకొని దెందుకూరు పిహెచ్సి డాక్టర్ పృద్వి ఆధ్వర్యంలో మధిర మున్సిపాలిటీ కార్యాలయం నందు మహిళా మునిసిపల్ కార్మికులకు, ఆర్పీలకు ప్రతేక వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది.
 ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మధిర మునిసిపల్ చైర్మన్ మొండితోక లత హాజరై మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సమాజ నిర్మాణంలో భాగ్యస్వామ్యం చేస్తున్నారు అదేవిధంగా మహిళల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దానికి నిర్వచనమే మహిళల ఆరోగ్య రక్షణ కార్యక్రమం అని ఇందుకుగాను ఆరోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావుకి, ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.ఈ కార్యక్రమంలో 19వ వార్డు కౌన్సిలర్ మాధవి, 11వ వార్డు కౌన్సిలర్ మాధురి , మున్సిపల్ కమిషనర్ రమాదేవి ,మెప్మా సీవో ఉపేంద్రమ్మ , మున్సిపల్ హెల్త్ అసిస్టెంట్ రేవతి , పీహెచ్సీ వైద్యులు గోలి రమాదేవి, హెల్త్ విజిటర్ కౌసల్య, ఏఎన్ఎం విజయలక్ష్మి, ఆశా కార్యకర్తలు ప్రశాంతి, మరియమ్మ,ఇతర ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.