సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి

Published: Monday May 16, 2022
-ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య
 
నస్పూర్, మే 15, ప్రజాపాలన ప్రతినిధి: సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీరాంపూర్ ఏరియా కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం నర్సయ్య భవన్ లో  కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సెంట్రల్ కార్యదర్శి మేకల దాసు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సీతారామయ్య ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు ఇవ్వాల్సి ఉన్నా సింగరేణి యాజమాన్యం హైపవర్ కమిటీ లో సింగరేణి సంస్థ సభ్యులం కాదు అంటూ వేతనాలు పెంచకుండా దాటివేస్తుందన్నారు.  సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సింగరేణి యాజమాన్యంన్ని డిమాండ్ చేశారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు అందరికీ సిఎంపీఫ్ మాత్రమే కట్ చేయాలి, అండర్ గ్రౌండ్ లో పనిచేస్తున్న రూప్ బోర్డింగ్ కార్మికులు ఫైర్ సీల్ కార్మికులకు, ఇతర విభాగాల కార్మికులందరికీ హై స్కిల్డ్  వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరిగినా సింగరేణి యాజమాన్యం పూర్తి బాధ్యత వహించి మెరుగైన వైద్యం కార్పొరేట్ హాస్పిటల్లో చేయించాన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు బ్యాంకుల ద్వారా 60లక్షల ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని కోరారు . సిఎంపీఫ్ చిట్టీలు ప్రతి సంవత్సరం ఇవ్వాలి. కాంట్రాక్ట్ కార్మికులు అందరికీ సింగరేణి హాస్పిటల్స్ లో ఓపి,  ఐపీ సేవలందించాల న్నారు. కాంట్రాక్ట్ కార్మికుల పనిస్థలాల్లో పూర్తి సామాజిక భద్రత సింగరేణి యాజమాన్యం వహించాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో  సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, బ్రాంచ్ కార్యదర్శి కొట్టే కిషన్ రావు ఏఐటీయూసీ మండల కార్యదర్శి దొడ్డిపట్ల రవీందర్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ప్రభాకర్,  దీలీప్ కుమార్, శివ, సందీప్, టి.రవి , ఈ.శంకర్, సమ్మయ్య, వెంకటేష్, ,సత్యనారాయణ, స్వప్న ,శ్రీలక్ష్మీ ,శారద పాల్గోన్నారు.