ఆటో లపై 714 జీ వో రద్దుచేయాలి

Published: Friday May 20, 2022
తహసీల్దార్ కు వినతిపత్రం అందజేసిన ఆటో యూనియన్ నాయకులు
 
నస్పూర్, మే 19, ప్రజాపాలన ప్రతినిధి: రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికుల బంద్ లో భాగంగా నస్పూర్ మున్సిపాలిటీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో స్వచ్చందంగా బంద్ పాటించారు.
గురువారం మంచిర్యాల జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు గాజుల ముకేశ్ గౌడ్  ఆదేశాల మేరకు నస్పూర్ టౌన్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ ఆధ్వర్యంలో  తహసీల్దార్  జ్యోతి కి వినతిపత్రం  అందజేశారు ఈసందర్బంగా వారు మాట్లాడుతు కెంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  తీసుకొచ్చినటువంటి  2019 రోడ్డు సేఫ్టీ బిల్లులో భాగంగా 714 జీవో నోటిఫికేషన్ ఆటోలపై రోజు వారి ఫిట్నెస్ లెట్ ఫైన్ 50 రూపాయలు రూపంలో చాలా ఆర్ధిక భారం పడుతుందని అన్నారు. 714 నోటిఫికేషన్ రోజువారీ ఫిట్నెస్ ఫైన్ నుండి ఆటోలను మినహాయించాలని కోరారు. 
ఈ కార్యక్రమంలో  ఆటో యూనియన్ నస్పూర్ అధ్యక్షుడు పులి రాజేందర్ గౌడ్,  సీసీసీ అధ్యక్షుడు ఆవుల సుధాకర్, కృష్ణ కాలనీ అధ్యక్షుడు, భద్రం తిరుపతి, కొత్తరోడ్  అధ్యక్షుడు చిలుక మల్లేష్,  ఆటో కార్మికులు పాల్గొన్నారు.