మందుల కిట్ ను పంపిణీచేసిన సర్పంచ్ తూము శ్రీనివాసరావు..

Published: Friday November 25, 2022

 తల్లాడ, నవంబర్ 24 (ప్రజా పాలన న్యూస్): మండలంలోనీ  నూతనకల్ గ్రామంలో గురువారం తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపర్వైజర్ పెద్ద పుల్లయ్య ఆధ్వర్యంలో రోగులకు బీపీ, షుగర్ తదితర పరీక్షలను నిర్వహించి మందులను పంపిణీ చేశారు. అనంతరం పెద్దపుల్లయ్య మాట్లాడుతూ రోగులు క్రమం తప్పకుండా ఆరోగ్య సూత్రాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు అన్నపూర్ణ, శిరీష, ఆశా కార్యకర్త విజయలక్ష్మి, గ్రామస్తులు పాల్గొన్నారు.