పోడు భూములు కాదు అవి అటవి భూములే . ...మహిళలను ముందు ఉంచి అటవి చట్టాల ఉల్లంఘన చేస్తున్నారు. ...ఐటిడ

Published: Tuesday July 12, 2022
మంచిర్యాల టౌన్, జూలై 11, ప్రజాపాలన: 
 
దండేపెల్లి మండలం కోయపోచం గూడెం గిరిజనులు ఆక్రమించుకుంటున్నవి
పోడు భూములు కాదని ,టైగర్ జోన్ పరిదిలోని బపర్ జోన్ అటవి భూములని  జిల్లా అటవీశాఖ అధికారి శివాని డోంగ్రే అన్నారు. జిల్లా లోని దండపల్లి మండలం కోయపోష గూడెం గిరిజనులు చేస్తున్నటు వంటి భూ అక్రమాలపై సోమవారం  జిల్లా అటవిశాఖ కార్యాలయంలో ని సమావేశ మందిరంలో  విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా డిఎఫ్ఒ మాట్లాడుతూ కోయపోచగూడెం గిరిజనులు కవ్వాల్ రిజర్వు టైగర్ జోన్ లోని బఫర్ జోన్ సంబంధించిన  భూము లను ఆక్రమించుకొని తత్కాలిక గుడిసెల ను ఏర్పాటు చేసుకొని భూపోరాటం పేరుతో అటవి చట్టాలను ఉల్లంఘింస్తు న్నారని అన్నారు. అటవి భూములు ఎన్నటికీ వారికి దక్కవని , తప్పుడు నిర్ణయాలతో  జైలు పాలు అవుతారని హెచ్చరించారు. 
 
 
* ప్రజా సంఘాల మద్దతు పలకడం దురదృష్టకరం.
 
అమాయక గిరిజన మహిళలను ముందు ఉంచి కొందరు చేస్తున్నటువంటి అటవి చట్టాల ఉల్లంఘనకు బాధ్యతా రహితమైనదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడుకునేలా వ్యవహారించా ల్సిన ప్రజాసంఘాలు గిరిజనులకు మద్దతు ఇవ్వడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. భూపోరాటం పేరుతో ఆందోళన చేస్తున్న వీరికి గ్రామంలో స్థిర నివాసాలు ఉన్నాయని తెలిపారు.  భూ ఆక్రమణ అడ్డుకొనుటకు వెళ్లిన సిబ్బంది పై కర్రల తో , కారంపొడిల తో దాడి చేశారని అన్నారు. వాస్తవాలు తెలియజేసి గిరిజనుల సమస్య కు పరిష్కార దిశగా ప్రజాసంఘాలు పనిచేయాలని కోరారు. అటవి భూముల అక్రమణ కు  పరిష్కారంగా ట్రైబల్ ,  పోలీస్ ,  ఫారెస్ట్ ,  రెవెన్యూ డిపార్ట్మెంట్లు కలిసి వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  గిరిజనులకు ఉపాధి నిమిత్తం పండ్ల మొక్కలను పెంచి వారికి ఉపాధిని కల్పించుటకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కృషి చేస్తుందని తెలిపారు.ఈ సమస్య పరిష్కారం కొరకు జాయింట్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి 24 గంటలు పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. ఇకపై ఎవరైనా అడవి భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.