సిపిఐ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు

Published: Wednesday September 14, 2022

మధిర సెప్టెంబర్ 13 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు మండలం పరిధిలోని మడుపల్లి, అల్లీ నగరం గ్రామాల్లో మంగళవారం సాయుధ తెలంగాణా పోరాట వారోత్సవాలను సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వారోత్సవాల్లో భాగంగా నాటి వీరోచిత సాయుధ తెలంగాణా పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని అమరులైన వారి స్థూపల వద్ద సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బెజవాడ రవి బాబు మండల కార్యదర్శి ఊట్ల కొండలరావులు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈసందర్బంగా బెజవాడ రవి, పంగా శేషగిరి మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనలో జామిందార్లు, జగిర్దార్లు, దేశ్ ముఖ్ లు, రజాకార్ల అకృత్యాలకు అరాచకాలపై భారత కమ్యూనిస్ట్ పార్టీ భూమికోసం,భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తికోసం, సాయుధ తిరుగుబాటుకు పిలుపునిస్తే అప్పటివరకు బాంచెన్ దొరా నీకాళమోక్తం అని చెప్పినోళ్లు బందూకులు, వడిసేళ్ళు చేతపట్టి వీర సైనికులులాగా తిరుగుబాటు చేసి రజాకార్లను, జామిందార్లను, జాగిర్దార్ల గడీలు బద్ధలుకొట్టి సుమారు నాలుగువేల గ్రామాలను విముక్తి కలగించి,10 లక్షల ఎకరాల భూమిని పంచిపెట్టారని వారు అన్నారు.

ఈ పోరాటంలో మధిర ప్రాంతంలో కూడా వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను ఈసందర్బంగా గుర్తుచేసుకుంటూ రాబోయే తరాలవారికి సాయుధ తెలంగాణా పోరాటం యొక్క విశిష్టతను తెలియజెప్పాలని ఈసందర్బంగా పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో

సిపిఐ జిల్లా సమితి సభ్యులు పెరుమాళ్ళపల్లి ప్రకాశరావు అల్లినగరం సర్పంచ్ గోసు ఏలాద్రి సీనియర్ నాయకులు ఊట్ల కామేశ్వరరావు, ఊట్ల మరుద్వతి, యలమద్ది రాము, మంగళగిరి రామానుజం, చెరుకూరి వెంకటేశ్వరరావు, సిరివేరు శ్రీను, అన్నవరపు సత్యన్నారాయణజల్లా భ్రమ్మం, గోపీ తదితరులు పాల్గొన్నారు