వడ్డరి కులస్తులకు 50 సంవత్సరాలు దాటిన వారికి 3000 రూ పింఛన్ ఇవ్వాలని పల్లపు విగ్నేష్ డిమాండ్*

Published: Thursday October 20, 2022

ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 19 ప్రజా పాలన ప్రతినిధి 

బుధవారం వడ్డెర వృత్తిదారుల ముఖ్యకార్యకర్తల సమావేశం తుర్కయాంజాల్ లో జరిగింది.ఈ సంధర్భంగా ఆ సంఘం రాష్ట్ర గౌరవ ఆధ్యక్షులు కుంచం.వెంకటకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లపు.విఘ్నేశ్ లు మాట్లాడుతూ గ్రామీణ ముఖ్య వృత్తిల్లో వడ్డెర వృత్తిదారులు నేడు రాయి పని, మట్టి పని, కంకర పని, కంప్రీషన్, కాంట్రాక్టర్ పనులతో పాటు నిర్మాణ రంగంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ వృత్తిలోకి అనేక కార్పోరేట్ కంపనీలు ప్రవేశించి, వేల కోట్ల రూపాయాలు ఆశిస్తున్నాయి. కానీ తరతరాలుగా ఈ వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న వడ్డెర వృత్తిదారులు మాత్రం ఇంక పేదరికంలోనే మగ్గుతున్నారు.  విద్య లేకపోవడం వల్ల పేదరికం, వెనుకబాటు తనం కారణంగా వృత్తిలో వచ్చే మార్పులను అందిపుచ్చుకోలేక పోతున్నారని అన్నారు.తద్వారా వడ్డెర వృత్తిదారులు మరింత దారిద్రంలోకి నెట్టివేయబడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 14 లక్షల కుటుంబాలకు పైగా వడ్డెరలు ఉన్నారని అన్నారు. నూటికీ 80 శాతం మంది వడ్డెర వృత్తిపైనే ఆధారపడి  జీవిస్తున్నారని అన్నారు. దీంతో 95 శాతం మంది అత్యంత వెనుకబడి వున్నారన్నారు. వృత్తిపరంగా ఎలాంటి ఆర్థిక పరమైన పెరుగుదల లేకపోవడం వలన అన్ని విధాలుగా సమాజంలో వెనుకబాటు తనం, అణచివేతకు, దోపిడికి,వివక్షతకు, గురవుతున్నారు. తద్వారా అవకాశాలను అందుకోలేకపోతున్నారని అన్నారు.                                 దళిత బంధు మాదిరిగా వడ్డెర బంధు ప్రకటించి వెనుకబడిన ప్రతి కుటుంబాన్నికి 10 లక్షలు కేటాయించి అభివృధ్ధి చేయ్యాలని కోరారు. ప్రతి నియోజకవర్గంలో వెనుకబడిన వడ్డెర వృత్తిదారుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయ్యాలని డిమాండ్ చేశారు.  50 సంవత్సరాలు దాటిన వడ్డెర వృత్తిదారులకు 3000 వేల రూపాయాల ఫీంఛన్ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం కాంట్రాక్టర్ పనుల్లో 30 శాతం పనులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.గుట్టలపై,కార్వీలపైన పూర్తి హక్కులు వడ్డెరలకే ఇవ్వాలని,    వడ్డెర ఫేఢరేషన్ కు 3000 వేల కోట్లు కేటాయించి, సొసైటీలకు ఎలాంటి షరత్తులు లేకుండా బ్యాంకులు లోన్లు ఇవ్వాలని కోరారు.వడ్డెర వృత్తిదారులకు ప్రమాదవశాత్తు మరణిస్తే 25 లక్షలు రూపాయల ఎక్స్క్రీషియ ఇవ్వాలి శాశ్విత అంగవైకల్యం చెందిన ప్రభుత్వం 15 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు.                      వడ్డెర వృత్తిదారులకు ఢబల్ బెడ్ రూమ్స్, ఇండ్లు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వడ్డెర వత్తిదారుల సమస్యలను పరిష్కరించాలని మాజీ మంత్రి షబ్బీర్ ఆలీ కీ వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ దేరంగుల.రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇరుగదిండ్ల.కురుమయ్య, నాయకులు తన్నీరు. సైమన్ తదితరులు పాల్గోన్నారు. 
 
 
 
Attachments area