పీర్జాదిగూడ పట్టణ అభివృద్ధికి సహకరించడం అభినందనీయం మేయర్ జక్క వెంకట్ రెడ్డి

Published: Tuesday June 14, 2022
మేడిపల్లి, జూన్ 13 (ప్రజాపాలన ప్రతినిధి)
పీర్జాదిగూడ పట్టణ అభివృద్ధికి              ప్రజలు స్వచ్ఛందంగా సహకరించడం అభినందనీయమనీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. 
పీర్జాదిగూడ మున్సిపల్ కార్యాలయంలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో  పీర్జాదిగూడ కమాన్ నుండి పర్వతాపూర్ వరకు రోడ్డు విస్తరణలో భాగంగా భవనాలు/స్థలాలు కోల్పోతున్న వారితో సమావేశాన్ని నిర్వహించారు. పీర్జాదిగూడ నుండి పర్వతాపూర్ వెళ్లే ప్రధానమార్గం అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పాలకమండలి ఏర్పాడిన మొదలు అనేక పర్యాయాలు కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సహకారంతో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు సమస్యను వివరించడం జరిగింది. అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ రోడ్డు విస్తరణకు హెచ్ ఎం డి ఏ ద్వారా సుమారు రూ. ₹26.32 కోట్లను మంజూరు చేసి వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది.  త్వరలో పనులు ప్రారంభం కానున్న సందర్బంగా రహదారి విస్తరణలో భవనాలు/స్థలాలు కోల్పోతున్న వారితో మున్సిపల్ కార్యాలయంలో సానుకూల వాతావరణంలో చర్చించి వారికి ఉన్న అనుమానలు నివృత్తి చేయడం జరిగింది. ఈ సందర్బంగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి చెందాలంటే మౌళిక సదుపాయల కల్పనలో రహదారుల విస్తరణ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఎవరైతే భవనాలు /స్థలాలు కోల్పోతున్నారో వారికి ప్రభుత్వం టిడిఆర్ రూపంలో నష్ట పరిహారం చెల్లిస్తుందని పేర్కొన్నారు.రహదారి నిర్మాణంతో ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు,రెండు వైపులా ఫూట్ పాత్,అవెన్యూ ప్లాంటేషన్, స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.తద్వారా పట్టణం మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో 100 ఫీట్ల రోడ్డు విస్తరణలో అనేక మంది పూర్తిగా నిర్వాసితులు అయ్యే అవకాశం ఉందని దానిని 70ఫీట్లకు కుదించాలని పలువురు విజ్ఞప్తి చేశారు. అందుకు సానుకూలంగా స్పందించిన అధికారులు ఇట్టి అభ్యర్ధనను ప్రభుత్వానికి నివేదిస్తామని స్పష్టం చేశారు.పట్టణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే మంచి ఆలోచనలో అందరూ స్వచ్చందంగా ముందుకు వచ్చి వారు రోడ్డు విస్తరణకు సుముకంగా ఉన్నట్లు అంగీకార పత్రాలను మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ కు అందజేశారు. కొందరు ప్రజా ప్రతినిధులు సైతం వారి స్థలాలకు సంబంధించి అంగీకార పత్రాలను సమర్పించారు.అనంతరం పట్టణ అభివృద్ధిలో భాగంగా రోడ్డు విస్తరణకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, నాయకులు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొల్తూరి మహేష్,కౌడే పోచయ్య,నాయకులు బొడిగే కృష్ణ గౌడ్, పప్పుల అంజిరెడ్డి,యాసారం మహేష్, అలవాల దేవేందర్ గౌడ్,చెరుకు పెంటయ్య, టి పి ఎస్ రాజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.