మిషన్ భగీరథ పైపు లైను లీకును పట్టించుకోని అధికారులు.....

Published: Wednesday December 15, 2021
ఎర్రుపాలెం డిసెంబర్ 14 ప్రజాపలన ప్రతినిధి: మిషన్ భగీరథ పైప్ లైన్ వెంటనే మరమ్మతులు చేయాలి మండలంలోని బనిగండ్లపాడు గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి రోజులు గడుస్తున్నా కాని పట్టించుకోని అధికారులు. లీకైన ప్రాంతంలోని మీరు వరదలాగా ఉండడంవల్ల ఆ ప్రాంత పంట పొలాల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరి ధాన్యం కోయడానికి వీలు లేకుండా నీరు మొత్తం పంటచేలో కి వచ్చి తడిసిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట పొలాల్లోకి వరి కోసే అందుకు మిషన్ కూడా పోయే సౌకర్యం లేదని రైతులు వాపోతున్నారు. వర్షానికి అసలే నష్టం జరిగింది సరైన సమయంలో కోతకు వచ్చిన పంటను కొయ్య కా పోవడం వలన మరీ ఎక్కువ నష్టం కలుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే మిషన్ భగీరథ సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులను నిర్వహించవలసిందిగా ఆ ప్రాంత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.