విఆర్ఏ లు చేస్తున్న నిరవధిక సమ్మెకు కాంగ్రెస్ పార్టీ సంఘీభావం

Published: Saturday August 27, 2022
మంచిర్యాల టౌన్, ఆగష్టు 26, ప్రజాపాలన: విఆర్ఏ లు చేస్తున్న నిరవధిక సమ్మెకు కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలిపారు శుక్రవారం కలెక్టర్ కార్యాలయం సమీపంలో వీఆర్ఏల దీక్షా శిబిరాన్ని సందర్శించిన కాంగ్రెస్ శ్రేణులు వారికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలను పరిష్కరించడంలో మొండి గా వ్యవహరించడం తగదని హితవు పలికారు. వీఆర్ఏలు నెల రోజులకు పైగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. 
ఈ కార్యక్రమంలో పీసిసి రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ,బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పూదరి తిరుపతి ,పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ ,డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మజీద్, మున్సిపల్ కౌన్సిలర్ కౌన్సిలర్, ఎస్సిసెల్ జిల్లా అధ్యక్షుడు రామగిరి బానేశ్,మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత,పట్టణ అధ్యక్షురాలు గజ్జెల హేమలత,వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్ట లావణ్య,సింగిల్ విండో డైరెక్టర్ తూముల వెంకటేష్, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు షేర్ పవన్ ,పట్టణ ఉపాధ్యక్షుడు జోగుల సదానందం, గట్టు స్వామి, పెంట రమేష్,తాజ్, షకీల్, తిరుపతి, రమేష్, అంజద్, శ్రీను, మాజీ కౌన్సిలర్ పూదరి ప్రభాకర్ కాంగ్రెస్ నాయకుడు కొండ చంద్రశేఖర్, ఆత్రం శంకర్, దాదు, మల్లికార్జున్, ప్రకాశ్, వేముల రమేష్, ఖదీర్,పర్వేజ్,అర్కాల హేమలత, అరిగెల పద్మ,లలిత,తదితరులు పాల్గొన్నారు.