వెంకటేశ్వర స్వామి ఆలయంలో దివ్య కళ్యాణం మహోత్సవం

Published: Wednesday March 29, 2023
ఎర్రుపాలెం, మార్చి 28 ప్రజాపాలన ప్రతినిధి:శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం జమలాపురం నందు నిర్వహించబడుతున్న వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా చైత్ర శుద్ధ సప్తమి మంగళవారం 10:30 గంటలకు లోకకళ్యాణార్థం *అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవంప్రారంభం అయినది.గణపతి పూజ పుణ్యాహవాచనం రక్షాబంధనం, సుముహూర్తం తలంబ్రాలు వంటి వైదిక ప్రక్రియలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. స్వామివారి కళ్యాణోత్సవానికి కార్యనిర్వహణాధికారి కొత్తూరు జగన్ మోహన్ రావు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ప్రతి సంవత్సరం వలే జమలాపురం గ్రామ పంచాయతీ వారు శ్రీ స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. శ్రీ స్వామివారి కళ్యాణం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి వారి కళ్యాణోత్సవాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.కళ్యాణమునకు వచ్చిన భక్తులకు దేవస్థానం నుండి ప్రత్యేక తీర్థ ప్రసాదములు, మహా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 5:30 నుండి శేష వాహనం పై గ్రామ సేవకు బయలుదేరి అనంతరం జమలాపురం తటాకం నందు అంగరంగ వైభవముగా *తెప్పోత్సవ* కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ప్రతి సంవత్సరం వలె ఈ కార్యక్రమమునకు అత్యంత భక్తితో తుళ్ళూరు కోటేశ్వరరావు నిర్మల కుమారి ఆర్థిక సహకారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహణాధికారి కొత్తూరు జగన్ మోహన్ రావు, తెలంగాణా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు , జమలాపురం గ్రామ సర్పంచ్ మూల్పురి స్వప్న, ఎం.పీ.టీసీ మూల్పురి శైలజ, కో- ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ మూల్పురి శ్రీనివాసరావు , వ్యవస్థాపక కుటుబసభ్యులు ఉప్పల కృష్ణ మోహన్ శర్మ , ఉప్పల శ్రీరామచద్రమూర్తి, ఉప్పల వెంకట జయదేవ శర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస్, ముఖ్య అర్చకులు ఉప్పల కృష్ణమోహన్ శర్మ, అర్చకులు రాజీవ్ శర్మ, ఆలయ సీనియర్ అసిస్టెంట్ కె. విజయ కుమారి స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.