అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి త్రివేణి కలెక్టరేట్ ఎదుట అం

Published: Tuesday July 12, 2022

ఆసిఫాబాద్ జిల్లా జులై 11(ప్రజాపాలన, ప్రతినిధి) : తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ ఉద్యోగులు  సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట  ధర్నా నిర్వహించరు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఆర్ త్రివేణి  మాట్లాడుతూ గుజరాత్ రాష్ట్రంలో రిటైర్డ్ అయిన 5 గురు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ఉద్యోగ విరమణ సదుపాయము అయిన గ్రాట్యుటీ వర్తింప చేయాలని కోరుతూ హైకోర్టులో కేసు వేశారని అన్నారు. రాష్ట్రములో చర్చల అనంతరం సుప్రీం కోర్టు ను ఆశ్రయించారన్నారు. 2022 ఏప్రిల్ 25 న కోర్టు అంగన్వాడీ ఉద్యోగుల కు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, అంగన్వాడీలు కార్మికులే నని, చట్టబద్ధ సౌకర్యాల పరిధిలోకి వస్తాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాట్యుటీ వర్తింప చేయాలని, న్యాయస్థానం తీర్పు ఇచ్చిందన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం మన రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాట్యూటీ చెల్లించాలని, వేతనము లో సగం పెన్షన్ నిర్ణయించాలని ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, 45వ ఐఎల్ సి,సిఫార్సు ప్రకారం కనీస వేతనం,, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని, 2017 నుండి టిఎ, డిఎ, మొత్తం చెల్లించాలని, దీని బడ్జెట్ ను వెంటనే రిలీజ్ చేయించాలని కోరారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అంగన్వాడీలు డిటీ జితేందర్ కు అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్, జిల్లా అధ్యక్షురాలు ఉమాదేవి, అంగన్వాడీలు కమల,జంగు బాయి, లలిత, రాజేశ్వరి, మల్లీశ్వరి, తదితరులు పాల్గొన్నారు.