అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు అధ్యాపకుల ఆవేదన

Published: Tuesday June 08, 2021

ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి, జూన్ 07, ప్రజాపాలన : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల, కళాశాలల, యందు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులకు లాక్‌డౌన్‌ కాలంలోని 2 నెలల వేతనాలు చెల్లించాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గోడిసెల కార్తీక్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్తీక్ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 40 వేలకు పైగా ప్రభుత్వ ఆ దినం లో నడుస్తున్న గురుకులాలు, జెడ్పి పాఠశాలలు, కేజిబిలు, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, తాత్కాలిక సేవలు, పొరుగు సేవలు, విద్యా వాలంటీర్లు, అతిధి అధ్యాపకులుగా చేస్తున్నారన్నారు. వీరికి ప్రస్తుతం కరోనా కోవిడ్ కాలంలో రెండు నెలలు లాక్ డౌన్ ఉండడం తో చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారి కుటుంబాలను పోషించుకో లేక పోతున్నారన్నారు. కావున ప్రభుత్వం కోవిడ్ 2 నెలల కాలంలోని జీతాలు చెల్లించాలని కోరారు.