ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 27 జపాలను ప్రతినిధి *బిసిలకు 50% రిజ్వేషన్లని వెంటనే కల్పించాలని బహుజ

Published: Monday November 28, 2022

మెట్రో న్యూస్,ఇబ్రహీంపట్నం: బహుజన్ సమాజ్ పార్టీ ఇబ్రహీంపట్నం అసెంబ్లీ కమిటీ ఆద్వర్యంలో డాగ్ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  27% ఉన్న బిసిల రిజర్వేషన్ లని 50% పెంచాలని డిమాండ్ చేస్తూ .దేశంలో చివరిసారిగా 1932లో బీసీల జనాభా గణన జరిగిందని, మనకు స్వాతంత్రం వచ్చే 75 ఏళ్లు గడిచిన ఇప్పటివరకు కూడా బీసీలవారీగా జన గణన జరగలేదన్నారు. ఇప్పటికి చట్టసభల్లో బీసీలకు సరైన రిజర్వేషన్లు లేకపోవడం బాధాకరమన్నారు.1990లో మాన్యవర్ కాన్షిరాం బీసీలకు చేసిన పోరాట ఫలితంగానే  బీసీల కోసం ప్రత్యేక కమిషన్ వేసి  27% రిజర్వేషన్ గా ఆమోదించడం జరిగిందన్నారు.ఇడబ్ల్యూఎస్  రిజర్వేషన్ అంటూ 8%శాతం ఉన్న ఓసి జనాభాకు 10% బిల్లు పెట్టి పార్లమెంట్లో ఆమోదించడం, సుప్రీంకోర్టు నుండి కూడా అనుమతి లభించడం ఆశ్చర్యకరమన్నారు.మేమెంత మందిమో మకంత వాటా,బిసిల జనగణన లెక్కలు చెయ్యాలని, బీసీల జనాభా ప్రకారం  రిజర్వేషన్లు అమలు చేయాలని  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చెశారు.ఈ కార్యక్రమంలో
రాష్ట్ర ఈసీ మెంబర్ బోళ్ల గణేష్ ముదిరాజ్,జిల్లా కార్యదర్శి అసెంబ్లీ ఇంచార్జీ పళ్లాటి రాములు,అసెంబ్లీ అధ్యక్షులు గ్యార మల్లేష్,మండల మండల కన్వీనర్లు గోరేటి కుమార్,గడ్డం మల్లయ్య,మచ్చ మహేందర్,
మున్సిపాలటీ కమిటీ అధ్యక్షులు సభ్యులు యంజాల ప్రహ్లద్,బంగారిగళ్ళ మహేందర్,జోగు స్వామి,
సెక్టార్ కమిటీ నాయకులు
చేతళ్ళ ఈశ్వర్,మహేష్ మహారాజ్,గంగిరెడ్డి సుధాకర్ రెడ్డి,పల్లాటి రాజు,గడ్డం రమేష్ తదితరులు పాల్గొన్నారు.