*జర్నలిస్ట్ జమీరొద్ధిన్ కు మంచిర్యాల జిల్లా జర్నలిస్టుల ఘననివాలి.

Published: Tuesday July 19, 2022
మంచిర్యాల  బ్యూరో, జులై18, ప్రజాపాలన:
 
 
 జగిత్యాల జిల్లా లో ఎలక్ట్రానిక్ మీడియా (ఎన్ టివి) జర్నలిస్ట్ వార్త సేకరణకు వెళ్తుండగా వరదల్లో చిక్కుకుని నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందారు. ఈ సందర్భంగా మంచిర్యాల జర్నలిస్ట్ లు సోమవారం స్థానిక ఐ బి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద స్వర్గీయ జమీరొద్దిన్ కు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. స్వర్గీయ జర్నలిస్ట్ జమీరోద్ధిన్ మృతి తీరని లోటని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం జర్నలిస్ట్ లు నేరెల్ల రమేష్, బన్న ఉపేందర్, కేశెట్టి వంశీకృష్ణ, కల్వల శ్రీనివాస్ మాట్లాడుతూ, వరదలను సైతం లెక్కచేయకుండా వార్త సేకరణకు వెళ్లి అక్కడి సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడం కోసం తన ప్రాణాలను కోల్పోవడం బాధాకరమన్నారు. స్వర్గీయ జమీరోద్దిన్ కుటుంభానికి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి అండగా నిలవాలన్నారు. జర్నలిస్ట్ లకు ప్రభుత్వం ఇప్పటికైనా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.