ఇంటి స్థలాలు లేని పేదలందరికి ఇంటి స్థలాలు కేటాయించి ప్రభుత్వమే ఇండ్లు కట్టించాలి* *వ్యవసాయ

Published: Saturday February 04, 2023

ఇబ్రహీంపట్నం పిప్రబరీ తేదీ 3 ప్రజాపాలన ప్రతినిధిమంచాల మండల ప్రజా సంఘాల ఐక్య వేదిక కమిటీ ఆధ్వర్యంలో ఇండ్లు లేని వారందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించి ఇండ్లు కట్టించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం గత 9 సంవత్సరాల నుండి ఇంటి స్థలాలు కాని ఇండ్లు నిర్మించడానికి నిధులు కేటాయించడం కాని జరగలేదు దీని ఫలితంగా గ్రామాలలో ఉన్న పేద ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలు అగ్రకులలో ఉన్న పేదలు చాలా మంది ఇండ్లు లేకపోవడం ద్వారా ఇతర ఇండ్లలలో నివాసం ఉండవల్సిన పరిస్థితి ఉంది అన్నారు. కొన్ని ఇండ్లు శితిల వ్యవస్థలో ఉండి వర్షాలు పడుతున్నాపుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్నారు. గతంలో ప్రభుత్వం మండలంలో ఇండ్లు లేని వారికి ఇంటి స్థలాలు కేటాయించింది  వారికి ఇండ్ల నిర్మాణం కోసం 5 లక్షలు ఇవ్వాలని అన్నారు. అదే విదంగా డబులు బెడ్ రూమ్ లు అర్హులైన వారికి మాత్రమే ఇవ్వాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రావుల జంగయ్య, సిలివేరు రాజు, పోచమని కృష్ణ, కాళ్ళ జంగయ్య, కొండిగారి బుచ్చయ్య, రామకృష్ణ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.