చిరు వ్యాపారులకు దుకాణాలు కేటాయింపుమాట నిలుపుకున్న చైర్ పర్సన్ లతా జయాకర్

Published: Wednesday December 14, 2022

మధిర డిసెంబర్ 13 (ప్రజాపాలన ప్రతినిధి) మధిర మున్సిపాలిటీలో ని చిరు వ్యాపారులకు మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లతా జయాకర్ న్యాయం జరిగింది. మధిర మున్సిపాలిటీలో ట్రాఫిక్ అడ్డంగా ఉన్నాయని చిరు వ్యాపారులకు సంబంధించిన బడ్డీ కొట్లను అధికారులు తొలగించారు. దీంతో చిరు వ్యాపారులు ఉపాధి లేక రోడ్డున పడ్డారు దీనిపై పలు రాజకీయ పార్టీలు ఉద్యమాలు చేశాయి. బడ్డీ కొట్లు తొలగించేటప్పుడు చిరు వ్యాపారులకు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నాయకత్వంలో చిరు వ్యాపారులు అందరికీ న్యాయం చేస్తామని చైర్ పర్సన్ మొండి తోక లత హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ గౌతం మధిర పర్యటనకు వచ్చినప్పుడు మున్సిపాలిటీకి బ్యాంకుకు మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో వీధి వ్యాపారులకు అవకాశం కల్పించాలని మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత కోరారు. దీనికి కలెక్టర్ సైతం ఆమోదం తెలపడంతో మంగళవారం మొత్తం 60 మంది చిరు వ్యాపారులకు కమిషనర్ అంబటి రమాదేవి ఆధ్వర్యంలో తహసీల్దార్ రాంబాబు డ్రా తీసి స్థలాలు కేటాయించారు. ఈ సందర్భంగా కమిషనర్ అంబటి రమాదేవి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గౌతం ఆదేశాల మేరకు మధిర మున్సిపాలిటీ పాలకవర్గం సహకారంతో వీధి వ్యాపారులకు స్థలాలు కేటాయించడం జరిగిందని ఆమె తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం చిరు వ్యాపారులకు న్యాయం చేసినందుకు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజుకి మధిర మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లతకి చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షులు పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్సై నరేష్ టౌన్ ప్లానింగ్ అధికారి రమేష్ పాల్గొన్నారు