అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతో రాజ్యాంగ బద్దంగా తెలంగాణ ఏర్పాటు జరిగింది..

Published: Thursday February 10, 2022
పాలేరు పిబ్రవరి 9 ప్రజాపాలన ప్రతినిధి : అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క ప్రస్ మీట్ తెలంగాణ పై మోడీకి ఉన్న అక్కసు రాజ్యసభ సాక్షిగా బయటపడింది అనేక ఇబ్బందులు తట్టుకుని తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతో రాజ్యాంగ బద్దంగా తెలంగాణ ఏర్పాటు జరిగింది. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట కోసం సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు బిల్లు పాస్ చేసేటప్పుడు.. తలుపులు మూసేసి ఓటింగ్ చేస్తారన్న విషయం మోడీకి తెలియదా. మోడీకి అది తెలియదు.... అప్పుడు అయన అసెంబ్లీ లో ఉన్నాడు కదా అని ఎద్దేవా.. మోడీ అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే... నిన్నటి నుండి కెసిఆర్ సైలెంట్ గా ఉండటం అనేక అనుమానాలను కలిగిస్తుంది ఆనాడు బిల్లు పాస్ కాకుండా వీగిపోతే తెలంగాణ వచ్చేదా? కేసీఆర్ చెప్పాలి సరైన మెజారిటీ లేనందునే అందరిని ఒప్పించడానికి ఆనాడు కొంత ఆలస్యం అయింది మోడీ వ్యాఖ్యలను ఖండించడానికి ఎందుకు కెసిఆర్ బయటకు రావడం లేదు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్... మోడీ అధికారంలో ఉంటే  ఇచ్చే వాడివి కాదు అని కెసిఆర్ చెప్పాలి తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పెట్టినప్పుడు ప్రతీ ఓటు ఇంపార్టెంట్ అనుకునే సమయంలో కూడా కెసిఆర్ పార్లమెంట్ కి పోలేదు. తెలంగాణ ప్రజలు బీజేపీ.. టి ఆర్ యస్. మాటలు నమ్మి పరిస్థితి లేదు తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ప్రధాని తీరును కెసిఆర్ ఖండించకుంటే.... మోడీ.. కెసిఆర్ కలిసి ఆడుతున్న నాటకం అని నిర్ధారణ అవుతుంది. టీఆరెస్- బీజేపీ నేతలకు తలయకాయలో మెదడు ఉందా? వారివి నాలుకలా-- తాటిమట్టలా? తెలంగాణ పై ప్రేమ అభిమానం ఉంటె కేసీఆర్ మోడీ మాటలను ఖండించాలి తెలంగాణ ఇచ్చిన కాంగ్రేస్ ను ఒక్క మాట అన్నా టీఆరెస్ తెలంగాణ జాతికి క్షమాపణ చెప్పాల్సి వస్తుంది అందరూ సమానమే అన్న రమానుజాచార్యులు ఎక్కడ- ఒకే మతాన్ని వెనుకేసుకున్న బీజేపీ ఎక్కడ. బడ్జెట్ లో ఉత్తరాది రాష్ట్రాలకు ఒక రకంగా- దక్షిణాది రాష్ట్రాలకు ఒకలా కేటాయింపులు ఉన్నాయి కేంద్రానికి పన్నులు కట్టే రాష్ట్రాలు దక్షిణాదివి- బడ్జెట్ కేటాయింపులు మాత్రం ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్తున్నాయి రామానుజాచార్యుల వద్ద బీజేపీ నేతల మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది