రెండున్నర ఏళ్ల ఒప్పందం లాంటిది ఏమీ లేదు * వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్

Published: Monday June 13, 2022
వికారాబాద్ బ్యూరో జూన్ 12 ప్రజాపాలన : 
రెండున్నర ఏళ్ల ఒప్పందం లాంటిది ఏమీ లేదని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్ ఘంటాపథంగా చెప్పారు. ఆదివారం జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ ఇంకా రెండున్నర సంవత్సరాలు నేనే మున్సిపల్ చైర్పర్సన్ ఉంటానని భరోసా కల్పించారు. మహిళా చైర్ పర్సన్  అని కూడా చూడకుండా సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేసి అవమానిస్తారా అని ధ్వజమెత్తారు. ఈ విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.ఇప్పటివరకు నేను ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని అన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశించిన ప్రతి పనిని తు.చ. తప్పకుండా పాటిస్తున్నాను అని వివరించారు. అధిష్టానం లక్ష్మణరేఖకు కట్టుబడి ఉంటానని విశ్వాసం వ్యక్తం చేశారు. సహాయ నిరాకరణ చేసేంత పెద్ద తప్పు నేనేమి చేయలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరో రెండున్నరేళ్లు పూర్తిగా ఐదేళ్లు నేనే వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గా కొనసాగుతానని ఘంటాపథంగా చెప్పారు. చిక్కుముడిగా మారిన వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ పదవి మార్పు వ్యవహారం. ఆదివారం వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో సమావేశమైన కౌన్సిలర్లు... మాట్లాడుతూ నేనే చైర్ పర్సన్ గా కొనసాగుతాను అంటూ ధీమా వ్యక్తం చేశారు. చైర్ పర్సన్ పదవి మార్పుకు అగ్రిమెంట్లు చెల్లుబాటు కావు అని గుర్తు చేశారు. వికారాబాద్ ఎమ్మెల్యే గారికి తలనొప్పిగా మారిన వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్ వ్యవహారం. మంజుల మార్పు లో నెగ్గేది ఎవరో..వేచి చూద్దాం.