మంత్రి మల్లారెడ్డిని కలిసిన డిప్యూటీ మేయర్ కార్పొరేటర్ కోఆప్షన్ సభ్యులు

Published: Friday July 15, 2022
మేడిపల్లి, జూలై14 (ప్రజాపాలన ప్రతినిధి)

 రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖా

మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి  అమెరికా పర్యటనను దిగ్విజయంగా ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్బంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, కార్పొరేటర్ భీమ్ రెడ్డి  నవీన్ రెడ్డి, తెరాస సీనియర్ నాయకులు పప్పుల ఆంజిరెడ్డి, పాశం బుచ్చి యాదవ్, బొడిగే కృష్ణా గౌడ్, కో ఆప్షన్ సభ్యులు రాందాస్ గౌడ్, 
జగదీశ్వర్ రెడ్డి, ఈర్ఫన్, జావీద్, చెరుకు పెంటయ్యలు మంత్రి మల్లారెడ్డి  నివాసంలో ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి
పూల బొకే అందజేసి శాలువాలతో సత్కరించారు.