చార్మినార్ కి చేరుకున్న భారత్ జోడో యాత్ర* -అడగడుగునా విశేష స్పందన, -కాంగ్రెస్ శ్రేణుల్లో కొత

Published: Wednesday November 02, 2022
చేవెళ్ల,నవంబర్ 01(ప్రజాపాలన):

కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ చేపట్టిన జూడో యాత్ర విజయవంతంగా కొనసాగుతుందని చేవెళ్ల నియోజకవర్గం నాయకులు అన్నారు. కాంగ్రెస్ జూడో యాత్ర హైదరాబాద్ నగరంలో మంగళవారం నాడు చార్మినార్ వద్దకు చేరుకుంటుందని అక్కడి నుంచి నెక్లెస్ రోడ్ కు పాదయాత్ర కొనసాగుతుందని నెక్లెస్ రోడ్ లో
జరిపే బహిరంగ సభన విజయవంతం కోసం చేవెళ్ల నియోజకవర్గంలోని వివిధ మండలాల కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీపీ, జెడ్పిటిసిలు ఎంపీటీసీలు ,సర్పంచులు కార్యకర్తలు అందరూ చేవెళ్ల వెంకటేశ్వర గుడి ప్రాంగణం నుంచి  చార్మినార్ వద్ద జూడో యాత్రలో రాహుల్ గాంధీ తో పాల్గొని నేక్లేస్ రోడ్ లో జరిగే మహాసభను విజయవంతం చేయడానికి భారీగా తరలి వెళ్లారు ఈ కార్యక్రమంలో చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దేశ ఐక్యతను కాపాడేందుకే రాహుల్ గాంధీ జూడో యాత్ర కొనసాగుతుందని రానున్న రోజుల్లో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని దీనికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుల పని చేయడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు జూడో యాత్రలో భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారని అన్నారు 8 సంవత్సరాల బిజెపి పాలనలో నోట్ల రద్దుతో, జిఎస్టి వలన దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని మత విద్వేషాలను రెచ్చగొట్టే బిజెపి పార్టీని ప్రజలు వ్యతిరేకించాలని కోరారు రాహుల్ జూడో యాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారని రానున్న రోజుల్లో దేశంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారని అన్నారు జూడో యాత్రకు నియోజకవర్గం నుంచి భారీగా కార్యకర్తలు నాయకులు తరలి వెళ్లారు ఈ కార్యక్రమంలో చేవెళ్ల నియోజకవర్గం లో వివిధ మండలాల గ్రామాల నాయకులు కార్యకర్తల పాల్గొన్నారు