పారిశుద్ధ్య రహిత గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

Published: Monday June 06, 2022
 పెండ్లిమడుగు సర్పంచ్ కేరెల్లి బుచ్చిరెడ్డి
వికారాబాద్ బ్యూరో 03 జూన్ ప్రజాపాలన  : పెండ్లిమడుగు గ్రామాన్ని పారిశుద్ధ్య రహిత గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని గ్రామ సర్పంచ్ కెళ్లి బుచ్చిరెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్ మండల పరిధిలోని పెండ్లి మడుగు గ్రామంలో ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ కెరెల్లి బుచ్చిరెడ్డ ఉప సర్పంచ్ బందయ్య ప్రత్యేక అధికారి అనిల్ కుమార్ పంచాయతీ కార్యదర్శి సంజీవ్ లతో కలిసి శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పెండ్లిమడుగు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుటకు అహర్నిశలు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా అలుపెరగని పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చినా వెంటనే నా దృష్టికి తీసుకొని రావాలని సూచించారు. తడి పొడి చెత్తను వేరు వేరు బుట్టలలో వేసి గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు అందచేయాలని స్పష్టం చేశారు. తడి పొడి చెత్తను మీ ఇళ్ల ముందు ఉన్న మోరీలో ఎట్టి పరిస్థితుల్లో వేయరాదని హెచ్చరించారు. బహిరంగ మల విసర్జన చేయరాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.