పినపాక నియోజకవర్గం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం. పలు కార్యక్రమాలకు శంక

Published: Wednesday December 07, 2022
అశ్వాపురం( ప్రజా పాలన.)
 
 
పినపాక నియోజకవర్గం లోని పల్లెలన్నింటిని మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దుతాం ,పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన... తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  .ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం లోని అశ్వాపురం మండలం మొండికుంట గ్రామ పరిధిలోని ఆర్ అండ్ బి వరకు ఇరువైపుల సుమారు కోటి 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో  సైడ్ డ్రైనేజ్ నిర్మాణ శంకుస్థాపన, అనంతరం అశ్వాపురం మెయిన్ రోడ్డు ఇరువైపులా సైడ్ డ్రైనేజ్ మరియు సెంట్రల్ లైటింగ్ నిర్మాణం కోసం సుమారు నాలుగు కోట్ల రూపాయలు అంచనా నిర్మించిన శంకుస్థాపన, అనంతరం మణుగూరు ప్రభుత్వ జూనియర్ & డిగ్రీ కళాశాల నందు అభివృద్ధి పనుల నిర్మాణం కోసం సుమారు రెండు కోట్ల 50 లక్షల రూపాయలతో మొత్తం డి ఎం ఎఫ్ టి  నుండి మంజూరైన నిధులతో .... తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు  చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. వీరితోపాటు జిల్లా కలెక్టర్ శ్రీ దురిశెట్టి అనుదీప్  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ దిండిగల రాజేందర్, సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, మండల అధ్యక్షుడు కోడి అమరేందర్, ఎంపీపీ ముత్తినేని సుజాత, ఎంపీటీసీ కమటం నరేష్, గాదజయ, మణుగూరు జడ్పిటిసి పోషం నరసింహారావు,  నియోజకవర్గ బిఆర్ఎస్  పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.