ఘనంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు జన్మదిన వేడుకలు

Published: Thursday November 11, 2021
కోరుట్ల, నవంబరు 10 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల పట్టణ టి.ఆర్.ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధుల అధ్వర్యంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి, ఈ సందర్బంగా కేక్ కట్ చేసి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టి.ఆర్.ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అన్నం అనీల్ మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అయిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధానకార్యదర్శి గుడ్ల మనోహర్, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీది పవన్, కౌన్సిలర్లు, కో అప్షన్ మెంబర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..