*ప్రీతి మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి* -ఐదు రోజులు పోరాడి ఓడిన ప్రీతీ. - సెట్టి

Published: Tuesday February 28, 2023
చేవెళ్ల ఫిబ్రవరి 27, (ప్రజాపాలన):-

కాకతీయ మెడికల్ కాలేజ్ వైద్య  విద్యార్థిని ప్రీతి మరణం అత్యంత బాధాకరం అని, ఈ మరణానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి అని, ప్రీతి కుట్టుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని, తక్షణమే సిట్టింగ్ జడ్జ్ చే విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి అని అంబేద్కర్ ప్రజా సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మైలారం సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు.
ఒక గిరిజన విద్యార్దిని ఉన్నత చదువులకు నోచుకోని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అంటే ఇంకా మనం ఎక్కడున్నామో అర్దం చేసుకోవాలి. కాలేజీలు, యూనివర్సిటీ లలో ర్యాగింగ నిషేధ చట్టం (1997)26 పూర్తిగా  అమలు చేయాలి ఇలాంటి సంఘటనలు జరగకుండా కటిన చర్యలు తీసుకోవాల్సిన భాధ్యత ప్రభుత్వం పై ఉంది. ఒక పక్క ఇలాంటి సంఘటనలు, మరో పక్క ఉన్మాదుల గాతకాలు ఇలా రాస్తంలో ఆడ పిల్లలకు భద్రత లేకపోవటం విచారకరం. ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.