రైతులకు మెరుగైన సేవలు అందించాలి

Published: Monday October 04, 2021
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూ 03 అక్టోబర్ ప్రజాపాలన : రైతులకు క్రాప్, ఎల్టి రుణాలు అందించడం కొరకు సరళీకృత విధానాలను అవలంభిస్తున్నామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఆదివారం వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని మేమిన్పేట్ మండల కేంద్రంలో గల ఏజెఆర్ వేడుక వేదికలో మోమిన్పేట్ పిఏసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి అధ్యక్షతన డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వ సభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సొసైటీ బ్యాంకులో జరిగే అన్ని లావాదేవీలు సభ్యులందరికీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చిరు వ్యాపారస్తులకు సొసైటీ బ్యాంక్ ద్వారా లోన్ కల్పించడం కోసం కొత్తగా (Mortgage loan) పథకం మొదలు పెడుతున్నామన్నారు. సొసైటీ సభ్యులు అందరూ తప్పని సరిగా ఫిబ్రవరి నెలలో తమ వడ్డీ డబ్బులు చెల్లించాలన్నారు. ప్రాథమిక సహకార సంఘం నుండి వచ్చే సదుపాయాల పై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సొసైటీ బ్యాంక్ సిబ్బంది రైతులకు సకాలంలో సహాయ సహకారాలందిస్తూ సంఘం బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మేకవనంపల్లి పిఏసిఎస్ చైర్మన్ అంజి రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, మోమిన్పేట్ వైస్ చైర్మన్ బావోజి రాంచంద్రారెడ్డి‌, డైరెక్టర్లు అంజిరెడ్డి, బుచ్చిరెడ్డి, అశోక్ రెడ్డి, విజేందర్ రెడ్డి, భాగ్యమ్మ, మాన్యానాయక్, సొసైటీ సిఈఓ శేఖర్, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.