ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ అవగాహన సదస్సు ఈఎఫ్ఎఫ్ఓఆర్టీ సంస్థ వారిచే మండలంల

Published: Saturday July 30, 2022
 బోనకల్లు జూలై 30 ప్రజా పాలన ప్రతినిధి: చైల్డ్ రైట్స్ , యు సంస్థ సహకారంతో ఎఫర్ట్ సంస్థ వారిచే ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని గోవిందాపురం(ఎల్), జానకిపురం,కలకోట గ్రామాలలోని హై స్కూల్ నందు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎఫర్ట్ సంస్థ ప్రోగ్రాం కోఆర్డినేటర్ సురేష్ మాట్లాడుతూ అక్రమ రవాణాను నిరోధించుటకు అవలంబించాల్సిన పద్ధతులు, బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ గురించి తెలియజేశారు. అదేవిధంగా పిల్లలు ఎదుర్కొనే వివిధ రకాల అవాంతరాలను ఏ విధంగా ఎదుర్కోవాలి అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు పిల్లలు చైల్డ్ లైన్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 , పోలీస్ హెల్ప్ లైన్ 100 నంబర్లను సంప్రదించాలని తెలియజేశారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు,బొమ్మలు గీయించడం ద్వారా వారిలోని సృజనాత్మకతను వెలికి తీసే విధంగా అవగాహన కల్పించారు.పిల్లలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై ఆయా గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా తమ ఎఫర్ట్ సంస్థ వారిచే ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చైల్డ్ రైట్స్ , యు సంస్థ సహకారంతో జూలై 26 నుండి ఆగస్టు 01 వరకు వారం రోజులు మండలంలోని అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు,ర్యాలీలు,కళా జాతాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గోవిందపురం హైస్కూల్ ప్రధానోపాధ్యా యురాలు లక్ష్మిరాజ్యం , టీచర్లు శివ,నర్సింహారావు,బాలస్వామి,ప్రసాద్,లక్ష్మణరావు,నాగభూషణం, భవాని, జానకిపురం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, టీచర్లు గురు ప్రసాద్, కలకోట పాఠశాల ప్రధానోపాధ్యా యురాలు సునీత,ఇంచార్జి ఎండి సలీం,జ్ఞానేశ్వర్ చారి ,సురేష్ బాబు ,శ్రీనివాస రావు, క్లర్క్ వెంకటేశ్వరరావు , ఎఫర్ట్ సంస్థ ప్రతినిధులు యం.కరుణ, టి.నరసమ్మ, సిహెచ్.గురవమ్మ,పద్మకళ, లాల్ బి,మౌనిక తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area