విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించాలి : జిల్లా విద్యాధికారిణి రేణుకాదేవి

Published: Saturday March 20, 2021

వికారాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధి మార్చి 19 ( ప్రజాపాలన ) : విద్యార్థులు గుణాత్మకమైన విద్య అభివృద్ధి దృష్ట్యా ప్రభుత్వ పాఠశాలలోని 4, 5, 6, 7వ తరగతుల విద్యార్థులకు శిక్షణ ఫౌండేషన్ వారు అందించే అభ్యాస పుస్తకాలను పంపిణీ చేశామని జిల్లా విద్యాధికారిణి తెలిపారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని శివారెడ్డి పేట్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు అభ్యాస పుస్తకాలను కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు అనంతరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సౌజన్యంతో శిక్షణ ఫౌండేషన్ వారు చేపడుతున్న ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి పాఠశాలలోని ఉపాధ్యాయులందరూ విధిగా కృషి చేయాలని కోరారు. విద్యార్థుల్లో అభ్యసన ఫలితాల సాధనకు కార్యాచరణ విద్యాధికారిణి సూచించారు. అభ్యాస పుస్తకాలు సరళంగా సులభంగా స్వీయ  అభ్యసనానికి ఎంతో అనువుగా ఉన్నాయని ఏఎంఓ రవి కుమార్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నైపుణ్యాల అభివృద్ధికి ఈ అభ్యాస పుస్తకాలు విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తుందని మండల విద్యాధికారి బాబు సింగ్ పేర్కొన్నారు. స్థానిక కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అనంత రెడ్డి మాట్లాడుతూ భాష గణిత అంశాలను విశ్లేషణాత్మకంగా ఉన్నాయని గుర్తు చేశారు. శిక్షణ ఫౌండేషన్ జిల్లా యాదగిరి మాట్లాడుతూ అన్ని మండలాల జిల్లా మొత్తం 25,770 విద్యార్థులకు ఒకరికి ఐదు చొప్పున ఈ అభ్యాస పుస్తకాలను పంపిణీ చేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శైలజ శిక్షణ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ శంకరయ్య శిక్షణ ఫౌండేషన్ మండల సీనియర్ రాములు సి ఆర్ పి రవి తదితరులు పాల్గొన్నారు.