బాడీ బిల్డర్ కు ఘనంగా సత్కరం

Published: Thursday September 30, 2021
మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్ 29, ప్రజాపాలన : 12వ ప్రపంచ బాడీ బిల్డింగ్ పోటీలకు వెళుతున్న కొలిపాక వెంకటేశ్వర్లుకి బిసి జాగృతి అద్వర్యంలో అభినందన సభను ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పలువురు వైద్యులు, స్వచ్ఛంద సేవా సమితి ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు  మాట్లాడుతూ  కొలిపాక వెంకటేశ్వర్లు మంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్ వాస్తవ్యులని, పేదరికంలో పుట్టి పెరిగిన ఇతను అనేక ఇబ్బందులను అధిగమిస్తూ రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అనేక పథకాలు సాధించడమే కాకుండా "మిస్టర్ తెలంగాణా" గా కూడా ఎన్నికైనారని కొనియాడారు. ఇలాంటి అకుంఠిత దీక్షతో ముందుకు వెళుతున్న శ్రీనివాస్ కి ఆర్థిక సమస్యలు అవాంతరాలు గా ఉన్నాయని,. సమాజం కూడా ఇలాంటి వారికి అండగా ఉండాలని అన్నారు. అదేవిధంగా ఆయనకు చేయూతనివ్వాలనే సదుద్దేశ్యంతో అమృత హాస్పిటల్ కార్తికేయ హాస్పిటల్ "హిల్స్ స్వచ్ఛంద సేవా సంస్థ- మంచిర్యాల" ద్వారా డాక్టర్ రాజ్ కిరణ్ 50,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించారు, అలాగే మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి రాను పోను విమానం చార్జీల నిమిత్తం 35000- ఆర్థిక సహాయం అందించారు నేటి యువతకు ఆదర్శంగా నిలిచిన కొలిపాక శ్రీనివాస్ ప్రపంచ బాడీ బిల్డింగ్ పోటీలో విజేత అయి తిరిగి రావాలని వారు ఆకాంక్షించారు. "హిల్స్ స్వచ్ఛంద సేవా సంస్థ", బి.సి.జాగృతి  సబ్యులు మాట్లాడుతూ సమాజం కూడా ఆర్థికంగా సహకారం అందించాలని అభిప్రాయపడ్డారు.