హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి : ఎం సి పి ఐ యు జిల్లాకార్యదర్శి సబ్బని కృష్ణ

Published: Thursday May 06, 2021

బెల్లంపల్లి, మే 5, ప్రజాపాలన ప్రతినిధి : కరోనాతో లక్షలాదిమంది మరణిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించడం లేదని ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయడం లేదని వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఎం సి పి ఐ యు జిల్లా కార్యదర్శి సబ్బని కృష్ణ డిమాండ్ చేశారు. బుధవారంనాడుస్థానికపార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ప్రజల అవసరాలను, అమయకత్వాన్ని ఆసరా చేసుకొని ఎన్నో ఆశలు కల్పించి గద్దెనెక్కి పాలన చేస్తున్న కేంద్ర, రాష్ట్ర పాలకులు ప్రజల ప్రాణాలు నిర్దాక్షిణ్యంగా గాల్లో కలిసిపోతున్న, వైద్య సౌకర్యాలు కల్పించలేక  అరకొరగా ఉన్న ఏమాత్రం స్పందించడం లేదని, ఎన్నికల జాతా మత్తులో మునిగి తేలుతున్నారని, అధికార దాహంతో బౌతిక దూరానికి కొత్త అర్థాలు చెపుతు బహిరంగ సభలు, కుంభమేళాలు హద్దు అదుపు లేకుండా జరుపుతున్నారని. పేదవాళ్ళ ప్రాణాలను గడ్డిపోసతో సమానంగా చూస్తున్నారని, కరోన సెకండ్ వేవ్ తప్పకుండా వస్తుందని ప్రపంచంలోని ఆరోగ్య నిపుణులు గత సంవత్సరం నుండే ఎంత అరిచి గీ పెట్టిన పాలకులు పట్టించుకోలేదనడానికి నిదర్శనమని లక్షలాది మంది అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోవడమేనని. ముందు చూపుతో వైద్య సౌకర్యాలు, వైద్యశాలలు వైద్య నిపుణులను ఏర్పాటు చేసుకోక పోవడం వల్ల సామాన్య ప్రజల దగ్గరి నుండి దేశానికి ఉపయోగపడే ఎంతో మంది మేధావులను, విద్యార్థులను, మహిళలను కోల్పోవడం జరిగిందని, అప్పుసప్పు చేసి ఇల్లువాకిలి అమ్మి లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి అప్పులపాలై భర్తకు తెలియకుండా భార్య,భార్యకు తెలియకుండా భర్త, అన్నకు తెలియకుండా తమ్ముడు,తమ్ముడికి తెలియకుండా అన్న శవాలుగా మారి పోతున్నారని హృదయ విధారకమైన ఇలాంటి దృశ్యాలు ప్రతినిత్యం కళ్ళముందు దర్శనమిస్తున్న శవాలను కాల్చడానికి, పూడ్చడానికి కూడా సరైన స్థలాలు లేక క్యూ లో పెట్టి  పడి గాపులు కాస్తున్నారని ఈవిధంగా ప్రజల చావులకు కారణమౌతున్న, ఈ ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పాడవాల్సిన అవసరంముందని, ఆ యన అన్నాడు. ఇప్పటికైన ప్రజల ప్రాణాలు కాపాడటానికి హెల్త్ ఎమర్జెన్సీ పాటించి తక్షణమే మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని అన్నారు.