బాల్య వివాహన్ని అడ్డుకున్న చైల్డ్ ఆఫీసర్స్

Published: Monday May 17, 2021
దోమ, మే 16, ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా, బాల్య వివాహన్ని అడ్డుకున్న సంఘటన దోమ మండల పరిధిలోని బట్ల సందారం గ్రామా పంచాయతీ పరిధిలోఆదివారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే బట్ల సందారం గ్రామస్థుడు ధారూర్ గ్రామానికి చెందిన బాలికను వివాహం చేసుకుంటున్నాడని విషయం తెలిసిన చైల్డ్ వెల్ఫేర్ సంస్థ వికారాబాద్ జిల్లా వారు ముందు జాగ్రత్తగా ఆదివారం గ్రామంలో విచారణ చేపట్టారు. ఈ విచారణలో ధారూర్ గ్రామానికి చెందిన అమ్మాయి మైనర్ బాలిక అని తెలింది. అనంతరం అబ్బాయిని విచారించగా వివాహ వయస్సు అయిన తరువాత నేను పెళ్లి చేసుకుంటాను అని గ్రామస్థులందరి సమక్షంలో వ్రాసి  ఇచ్చారు అన్ని  చైల్డ్ వెల్ఫేర్ సంస్థ వికారాబాద్ జిల్లా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వార్ల రాములు, ఏఎస్ఐ సంగమేశ్వర్, గ్రామస్థులు పాల్గొన్నారు.