ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

Published: Monday June 27, 2022
మేడిపల్లి, జూన్26 (ప్రజాపాలన ప్రతినిధి)
రామంతాపూర్ డివిజన్ ఇంద్ర నగర్లోని ప్రతిభ ఉన్నత పాఠశాలలో మథుర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మథుర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఇలాంటి ఉచిత మెగా మెడికల్ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలనీ, ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో దాదాపు 20 ఏళ్ల నుండీ మథుర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవ కార్యక్రమాలను చేపట్టామని రాగిడి లక్ష్మారెడ్డి తెలిపారు. దాదాపు 45 వేల మంది మథుర చారిటబుల్ ట్రస్ట్ సేవల ద్వారా లబ్ది పొందారు, ఇంకా నియోజవర్గం పరిధిలో మరింత వేగంగా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఈ వైద్య శిబిరంలో సహకరిస్తున్న కిమ్స్ హాస్పిటల్, అభినవ్ కంటి ఆసపత్రి యాజమాన్యానికి,సిబ్బందికి మరియు యువ శ్రీ డయాగ్నొస్టిక్స్స వారి సిబ్బందికి  ప్రతేక ధన్యవాదాలు తెలిపారుు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ నాయకులు వినోద్, సుధాకర్ శెట్టి,  తవిడబోయన గిరిబాబు, జిల్లా ఎస్ టి సెల్ చైర్మన్ గణేష్ నాయక్, జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సంతోష్, షబ్బీర్, మురళీ కృష్ణ ముదిరాజ్, రాపోలు అరుణ్, సచ్చిన్,మధు, శ్రీకర్, సాయి ముదిరాజ్, మనీష్, సతీశ్ గుప్తా, ఎండీ రిజ్వన్, పుల్లారెడ్డి, రియాజ్, తదితరులు పాల్గోన్నారు.