మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటనకు పూర్తి ఏర్పాట్లు

Published: Thursday April 13, 2023
* వికారాబాద్ బ్యూరో 12 ఏప్రిల్ ప్రజాపాలన : ఈనెల 13న ( గురువారం ) రాష్ట్ర వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన సందర్భంగా ఏర్పాట్లు అన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం అనంతగిరిగుట్ట లోని టిబి ఆస్పత్రిలో తాత్కాలికంగా చేపట్టిన వైద్య కళాశాల నిర్మాణ పనులను కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.  ఇందులో భాగంగా పరిపాలన విభాగము, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ విభాగము, లెక్చర్ హాల్స్, కామన్ బ్లాక్ నిర్మాణపు పనులను కలెక్టర్ పరిశీలించి అట్టి వివరాలను సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో అడిగి తెలుసుకున్నారు.  శంకుస్థాపనలు చేయనున్న 50 పడకల ఆయుష్ ఆసుపత్రి, సెంట్రల్ మెడికల్ స్టోర్ పనులను కలెక్టర్ పరిశీలించారు.  ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రెండంతస్తులలో చేపట్టిన నిర్మాణ పనులను కూడా వైద్య శాఖ అధికారులతో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు సలహాలు అందజేశారు.  మంత్రి పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్ నాగమని, టి ఎస్ ఎం ఎస్ ఐ డి సి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస రావు, డి ఇ లక్ష్మీనారాయణ, మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ డా. రామచంద్రయ్య, జిల్లా వైద్య శాఖ అధికారి పాల్వాన్ కుమార్, డి సి హెచ్ ఎస్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.