రిటైర్ అయిన రోజే పెన్షన్ సాంక్షన్ ఆర్డర్ కాపీ ఇవ్వాలి : మల్రాజు శ్రీనివాసరావు డిమాండ్

Published: Wednesday June 30, 2021

బెల్లంపల్లి, జూన్ 29, ప్రజాపాలన ప్రతినిధి : సింగరేణిలో దశాబ్దాలపాటు ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందిన కార్మికులకు పదవి విరమణ పొందిన రోజున్నే వారి యొక్క వేతనాన్ని లెక్క చేసి పెన్షన్ ఇస్తారని పెన్షన్ ఇవ్వడానికి ముందే పెన్షన్ సాంక్షన్ కాఫీ ఇవ్వాలని బెల్లంపల్లి ఏరియా యా టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు మల్రాజు శ్రీనివాస రావు డిమాండ్ చేశారు. మంగళవారం నాడు పత్రికలకు ప్రకటన విడుదల చేస్తూ కార్మికుడు పదవి విరమణ చేసిన రోజున్నే ఎలాంటి సాంక్షన్ కాపీ ఇవ్వకుండానే పెన్షన్ డబ్బులు వారి ఖాతాలో జమ చేస్తున్నారని దీనివలన ఎప్పుడైనా కార్మికుడు దురదృష్టవ శాత్తు మరణిస్తే ఆయన సతీమణి కి విడో పెన్షన్ కావాలని అధికారులను సంప్రదిస్తే గతంలో నీ భర్తకు పెన్షన్ సాంక్షన్ అయినా కాఫీ తీసుకువస్తేనే నీకు పెన్షన్ ఇస్తాము అని చెప్పడం జరుగుతుందని దీని వలన ఆమెకు పెన్షన్ రాకుండా ఆగి పోతున్నదని కాబట్టి పెన్షన్ కాపీ కావాలని ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తున్నదని పదవి విరమణ పొందిన కార్మికులకు నెలలోపు సీఎం పిఎఫ్ డబ్బులు ఇవ్వడంతోపాటు పెన్షన్ సాంక్షన్ చేయాలని చేసిన సాంక్షన్ లెటర్ను కూడా సంబంధిత ఉద్యోగికి అందజేయాలని ఆయన యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.