మధిరలో 17వ వార్డు ఉచిత వైద్య శిభిరం

Published: Friday August 27, 2021
మధిర ప్రజా పాలన ప్రతినిధి 26వ తేదీ ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అదికారిణి డా మాలతీ ఆదేశాల మేరకు  పిహెచ్సి వైద్య అధికారిణి డా పుష్పలత మరియు పారా మెడికల్ బృందం ఆధ్వర్యంలో మధిర పట్నంలో సిపిఐ ఆఫీస్ రోడ్ లో కురువెళ్ల రెసిడెన్సీ ప్రాంగణంలో డెంగీ సొకిన వ్యక్తి ఉన్న విషయం విధితమే కనుక జ్వరాలు సర్వే అనంతరం డా పుష్పలత మరియు హెచ్స్ లంకా కొండయ్య పారా మెడికల్ బృందంచే ఉచిత వైద్య శిభిరం ఏర్పాటు చేసి జ్వర పరీక్షలు మరియు రక్త నమూనాలు సేకరణ చేయించారు. చిరు వ్యాదులకు చికిత్స చేసినారు. తగిన మందులు ఇచ్చినారు. మున్సిపల్ కమిషనర్ శ్రీమతి రమాదేవి మరియు మధిర మున్సిపల్ చైర్మన్ శ్రీమతి మొండితోక లత జయకర్  పర్యవేక్షణలో రాత్రి పూట వీదులు వెంట మున్సిపల్ సిబ్బందిచే దోమలు నివారణకు ఫాగింగ్ చేయిస్తున్నారు ఈ సందర్బంగా డా పుష్ప లత  మాట్లాడుతూ  దోమలు  కుట్టకుండా, దోమలు పుట్ట కుండా ప్రతి ఒక్కరు డ్రైడే కీ పారామెడికల్ సిబ్బంది కీ సహకరించాలి అని వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్స్ లంకా కొండయ్య ఎఎన్ఎం వై లక్ష్మి, హెచ్ఎ గుర్రం శ్రీను అంగన్వాడీ లత, వార్డు ఇంచార్జ్ దిలీప్, ఆశలు ముంతాజ్, అంజు, నాగమణి మెప్మా కార్యకర్తలు పాల్గొన్నారు.