సి ఐ టి యు కార్మిక గర్జన

Published: Monday September 13, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 12, ప్రజాపలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం తుర్కయంజాల్ పరిధిలో సి ఐ టి యు కార్మిక గర్జన పాదయాత్ర ఈ నెల ఎనిమిదో తారీకు ప్రారంభమై ఈరోజు తుర్కయంజాల్ మున్సిపాలిటీ కి రావడం జరిగింది. ఈ సందర్భంగా సి ఐ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీదేవి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక హక్కుల పై దాడిని తీవ్రతరం చేసింది, 29 కార్మిక చట్టాలు రద్దుచేసి నాలుగు రేపు లేబర్ కోడు లను తీసుకొచ్చి, కరోనా కష్టకాలంలో ప్రజలను పట్టించుకోకుండా పార్లమెంటులో ప్రతిపక్షాల గొంతు నొక్కి కార్మిక సంఘాల అభిప్రాయాలను బుట్టదాఖలు చేసి. కార్మిక వ్యతిరేక కోడ్ లు చేసింది. ఈ కోడ్ ను రద్దు చేయాలని స్నేహితుడు డిమాండ్ చేస్తుంది, తెలంగాణ వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు భారీగా, జీతాలు పెంచుకున్నారు. రాష్ట్రంలో కార్మికుల వేతనాలు మాత్రం పెంచలేదు, కార్మిక గర్జన పాదయాత్రలో, ఎస్ వీరయ్య గారు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి భూపాల్ గారు, రాష్ట్ర మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి, పాలడుగు భాస్కర్, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి, సి ఐ టి యు రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున గారు, సిఐటియు జిల్లా అధ్యక్షులు కాడి గల భాస్కర్, సి ఐ టి యు రంగారెడ్డి జిల్లా ఆఫీస్ బేరర్స్, సిఐటియు మండల నాయకులు, వివిధ రంగాల కార్మికవర్గం భారీ సంఖ్యలో పాదయాత్రకు స్వాగతం పలికి అబ్దుల్లాపూర్మెట్ మండలంలో జయప్రదం, జయప్రదం చేశారు. నరసింహ సిఐటియు జిల్లా నాయకులు. కోరారు.