కుట్టు పనులలో నైపుణ్యం సాధించండి * కుటుంబ పోషణకు మీ వంతు ఆర్థిక సహకారం అందించండి * బ్రెడ్ స్వచ

Published: Thursday July 28, 2022
వికారాబాద్ బ్యూరో 27 జూలై ప్రజాపాలన : కుట్టు పనులలో నైపుణ్యం సాధించి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడాలని బ్రెడ్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ సత్తయ్య అన్నారు. బుధవారం బ్రెడ్ స్వచ్ఛంద సంస్థ వికారాబాద్ ఆధ్వర్యంలో మొయినాబాద్ లోని శిక్షణ కేంద్రంలో 40 మంది మహిళలకు ఉచిత కుట్టు పనులలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిద్ధులూరు గ్రామ సర్పంచ్ బంటు ఆంజనేయులు ముదిరాజ్ వికారాబాద్ మండల బీసీ సెల్ అధ్యక్షుడు ద్యాచారం పాండు రవి కుట్టు మిషన్ల శిక్షకురాలు ఉమారాణి ఆధ్వర్యంలో శిక్షణార్థులకు ఉచితంగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 రోజుల పాటు ఉచితంగా కుట్టు పనులలో వివిధ రకాల కుట్టు పనులను శిక్షకురాలు ఉమారాణి అందించనున్నారని పేర్కొన్నారు. మంచి నైపుణ్యం సాధించి కుటుంబ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడాలని హితవు పలికారు. మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా ఆర్థిక ఇబ్బందులను తట్టుకొని ఎదగాలని సూచించారు. భర్త సంపాదనతో పాటు మీ సంపాదన కూడా తోడైతే కుటుంబానికి ఆర్థికంగా ఏ ఇబ్బంది రాదని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉచితంగా ఇచ్చే కుట్టు పనిని నిర్లక్ష్యం చేయకుండా ఏకాగ్రతతో నేర్చుకోవాలని కోరారు. నేటి మహిళలు యువతులు బాలికలు వివిధ రకాల డిజైన్లతో కూడిన కుట్టు పనుల వస్త్రాలను ధరించుటకు ఆసక్తి చూపుతున్నారని గుర్తు చేశారు. స్వయం శక్తితో సంపాదించే డబ్బులకు విలువ గౌరవం ఎక్కువగా ఉంటుందని హితోక్తి పలికారు. కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలంటే ఏదో ఒక పనిని నైపుణ్యంతో నేర్చుకోవాలని సూచించారు. పట్టుదలతో క్రమశిక్షణతో ఏకాగ్రతతో అనుకున్న లక్ష్యాన్ని చేరుటకు గమ్యాన్ని వీడ రాదని హితవు పలికారు. సాధించాలనే తపనతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. తాను నేర్చుకున్న పనిని ఇతరులకు నేర్పించడంతో ఆర్థికంగా లబ్ధి పొందవచ్చని తెలిపారు. ఉద్యోగాల వైపు చూడకుండా తామే స్వయంగా ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశాలు సృష్టించుకోవచ్చని గుర్తు చేశారు. తాను ఆర్థికంగా ఎదుగుతూ ఇతరులకు కూడా తోడ్పడాలని సూచించారు.