'పల్లె నుండి ఢిల్లీ' జ్ఞాన యుద్ద యాత్ర గోడ పత్రికను ఆవిష్కరించిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడ

Published: Thursday November 18, 2021
హైదరాబాద్ 16 నవంబర్ ప్రజాపాలన ప్రతినిధి : 'పల్లె నుంచి ఢిల్లీ' యాత్ర అనే గోడ పత్రిక మాల మహానాడు బృందం మంగళవారం నాడు ట్యాంక్ బండ్ వద్ద ఆవిష్కరించారు. భారత కరెన్సీ నోట్ల పైన డాక్టర్.బి.ఆర్. అంబేద్కర్ చిత్ర పటం ముద్రించాలని డిమాండ్ చేసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు. అంతేకాకుండా అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాలు సైతం డాక్టర్.బి.ఆర్. అంబేద్కర్ చిత్ర పటంను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటాన్ని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల వేడుకల సందర్భంగా  చిత్ర పటాన్ని తప్పకుండా ఏర్పాటు చేసి జాతీయ జెండాను ఆవిష్కరించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మంగళవారం నాడు భారత కరెన్సీ నోట్ల ముద్రణ కమిటీ ఆధ్వర్యంలో జేరిపోతుల పరుశురాం చేపట్టిన జ్ఞాన యుద్ధ యాత్ర 'పల్లె నుంచి ఢిల్లీ' వరకు చైతన్య యాత్ర గోడ పత్రిక ను ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం సాక్షిగా దళిత సంఘాల నేతలు ఆధ్వర్యంలో విడుదల చేశారు.