ఆహార పదార్థాల వ్యాపారులు సర్టిఫికేషన్ పొందాలి

Published: Saturday October 01, 2022
వ్యాపార సముదాయ అధ్యక్షులు పోకల సతీష్
వికారాబాద్ బ్యూరో 30 సెప్టెంబర్ ప్రజా పాలన : ఆహార పదార్థాల వ్యాపారులు
 ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్  తప్పనిసరిగా పొందాలని వ్యాపార సముదాయ అధ్యక్షులు పోకల సతీష్ సూచించారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలో గల సాకేత్ నగర్ లో ఎఫ్ఎస్ఎస్ఎఐ 2006 యాక్ట్ 55 ప్రకారం ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యాపారులు, ప్రజలు అవగాహనా పెంచుకోవాలి. భారత ప్రభుత్వం అదేశాల మేరకు ఆహార  పదార్థాల వ్యాపారులు ఫోస్టాక్ [ ఎఫ్ఓఎస్ టిఎసి ] శిక్షణ సర్టిఫికెట్ పొందాలని, సెక్షన్ 55 పట్ల ప్రజలు, వ్యాపారులు అవగాహనా పెంచుకుని పాటించాలని తెలిపారు. ఈ మేరకు వికారాబాద్ నగరం లోని హనుమయ్య నిలయం, సాకేత్ నగర్, ఒప్పొసిట్ బస్సు డిపో, ఫోస్టాక్  కార్యాలయంలో ఫసాయి యాక్ట్ 2006, సెక్షన్ 55 పై రాష్ట్ర కో ఆర్డినేటర్స్ సి. కేశవర్ధన్ రెడ్డి, ఎం. హరి కృష్ణ, ఎం. కృష్ణమూర్తిల అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర ఇంచార్జ్ కెవిజివిఎం సింధు జోస్, మోహన్ బాబు, మేనేజర్  కె.సుధాకర్  హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ  హోటల్స్, స్వీట్స్ అండ్ బేకరీస్, రెస్టారెంట్స్, ఫాస్టుఫుడ్ సెంటర్స్,బిర్యానీ పాయింట్స్, కూల్డ్రింక్స్, జ్యూస్ సెంటర్స్, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, టి హబ్స్, ఐస్ క్రీం పార్లర్స్, మెస్ లు, చికెన్ అండ్ మటన్ షాప్స్, మినరల్ వాటర్ ప్లాంట్స్, కిరాణం అండ్ సూపర్ మార్కెట్స్, ఆహార సంబంధిత వ్యాపారులు ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. ఫోస్టాక్ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ వారి వారి వ్యాపార సముదాయముల వద్దకే వచ్చి ఆధార్ జిరాక్స్, మొబైల్ నెంబర్, షాప్ పేరు సమాచారం సేకరిస్తారని, ఇందుకు ఫోస్టాక్ శిక్షణ సర్టిఫికెట్ కొరకు రుసుము చెల్లించవలేనని, శిక్షణ పొందిన తర్వాత సర్టిఫికెట్ ను మీ వద్దకే వచ్చి ఇవ్వడం జరుగుతుందని కెవిజివిఎం నిర్వాహకులు తెలియజేశారు. ఈ సమావేశంలో కెవిజివిఎం నిర్వాహకులు అండ్ రాష్ట్ర, జిల్లా కో ఆర్డినేటర్స్ తదితరులు పాల్గొన్నారు.