మద్యం మత్తులో డ్యూటీ చేస్తున్న విద్యుత్తు లైన్ మెన్ విద్యుత్ అంతరాయం గురించి అడిగితే మద్యం

Published: Monday November 14, 2022

బోనకల్, నవంబర్ 13 ప్రజా పాలన ప్రతినిధి: మద్యం మత్తులో రాత్రిపూట డ్యూటీలో ఉన్న విద్యుత్తు లైన్మెన్ ను శనివారం రాత్రి విద్యుత్ అంతరాయం ఏర్పడటం వల్ల స్థానికులు ఫోన్ చేసి ఏమిటి సార్ విద్యుత్ అంతరాయం సమస్యని అడిగితే పొంతన లేని సమాధానం చెబుతూ కరెంటు వచ్చిన దాకా ఆగలేరా అంటూ మద్యం మత్తులో తిక్క సమాధానాలు చెబుతూ మాట్లాడుతున్నారు. మీరు మద్యం మత్తులో ఉన్నారు అని అడగగా అవును నేను మద్యం మత్తులో ఉన్నాను అని ధీమాగా మాట్లాడుతున్నాడు. మీ పై అధికారులకు తెలియజేస్తామని చెప్పగా నీకు చేతనైతే ఎక్కడైనా చెప్పుకో ఏమి చేసుకుంటావో చేసుకో అంటూ మాట్లాడుతున్నారు. స్థానికులు పై అధికారులకు ఫోన్ చేయగా వారి ఫోన్లు పని చేయడం లేదు. విద్యుత్ అధికారులకు విద్యుత్ అంతరాయం గురించి ప్రజలు అడిగితే సమాధానం చెప్పలేకపోతున్నారు. మండల కేంద్రంలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న విద్యుత్ లైన్ మెన్ షేక్ జమీర్ ప్రతిరోజు పగలనక రాత్రనక మద్యం మత్తులో డ్యూటీ చేస్తూ గ్రామీణ ప్రజలు ఎవరైనా విద్యుత్ అంతరాయం ఏర్పడి ఫోన్ చేసినచో సమాధానం చెప్పలేని పరిస్థితిలో లైన్మెన్ ఉన్నాడు. విద్యుత్ శాఖలో ఇటువంటి మద్యం మత్తులో డ్యూటీ చేస్తున్న విద్యుత్ లైన్మెన్ ను ఇంతవరకు చూడలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం ఇటువంటి మద్యం మత్తులో డ్యూటీ చేస్తున్న లైన్మెన్ ను విద్యుత్ శాఖలో ఎలా పనిచేయనిస్తున్నారు అని ప్రజలు అంటున్నారు. తన తోటి జూనియర్ విద్యుత్ అధికారులు ట్రాన్స్ఫారంలో సమస్య ఉండి రాత్రిపూట పనిచేస్తుంటే తను మాత్రం మద్యం మత్తులో ఉండి విద్యుత్ అంతరాయం గురించి ఎవరైనా వచ్చి ఏమిటి అని సమస్య అడిగితే కరెంటు వచ్చిందాకా ఆగలేరా అంటూ వంకర సమాధానం చెబుతున్నాడు. మద్యం మత్తులో ఉన్న లైన్ మెన్ కు విద్యుత్ అంతరాయం గురించి ప్రజలు సమస్యలు అడిగితే మత్తులో ఉండి ఏమి చెప్పాలో అర్థం కాక సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి కూడా మద్యం మత్తులో పనిచేస్తున్న విద్యుత్తు లైన్మెన్ గురించి పై అధికారులు పట్టించుకోకా , నన్ను ఎవరు ఏమి చేయలేరంటూ ఎవరైనా ఫోన్ చేసి అడిగితే అర్థం లేని సమాధానాలు చెబుతూ మద్యం మత్తులో ఉండి ఇక్కడ కాకపోతే ఇంకా ఎక్కడైనా డ్యూటీ చేసుకుంటానని, మీకు చేతనైతే ఎవరికైనా ఫోన్ చేసుకోండి నన్ను ఎవరు ఏమి చేయలేరంటూ అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని స్థానికులు అంటున్నారు. ఇకనైనా విద్యుత్ శాఖ పై అధికారులు స్పందించి ఇటువంటి మద్యం మత్తులో ఉన్న విద్యుత్తు లైన్ మెన్ పై తగిన చర్యలు తీసుకొని ఇకనుండి విద్యుత్ అంతరాయంపై ప్రజల అడిగినప్పుడల్లా సమాధానం చెప్పే విధంగా విద్యుత్ పై అధికారులు మద్యం మత్తులో ఉన్న విద్యుత్తు లైన్ మేన్ కి తగు హెచ్చరికలు ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.