ఈనెల 23 న ప్రారంభమయ్యే సిపిఎం జిల్లా పాదయాత్ర ను జయప్రదం చేయండి

Published: Friday March 19, 2021

వలిగొండ ప్రజా పాలన ప్రతినిధి ఈనెల 23 నుండి ఏప్రిల్ 22 వరకు జిల్లా వ్యాప్తంగా జరుగు సిపిఎం జన చైతన్య పాదయాత్ర ను జయప్రదం చెయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వేముల మహేందర్ పిలుపునిచ్చారు ఈరోజు స్థానిక సిపిఎం మండల కార్యాలయంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో మండల కార్యదర్శి మద్దెల రాజయ్య  తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడుతూ జిల్లా పరిధిలోని పెండింగులో ఉన్న బునాది గాని కాల్వ,పిలాయిపల్లి కాల్వ ధర్మారం కాల్వ బొల్లెపల్లి కాల్వ, పెండింగ్ పనులను వెంటనే ప్రారంభించాలని కోరుతూ గత రెండు సంవత్సరాలు గా మంజూరై పెండింగులో ఉన్న పెన్షన్లు ఇవ్వాలని,రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో దళితులకు ఇచ్చిన 3 ఎకరాల భూమి పంపిణీ,డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని  వెంటనే వేగవంతం చేయాలని జిల్లా కేంద్ర ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చాలని ప్రతి మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 100 పడకల ఆసుపత్రిగా మార్చాలని జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని వలిగొండ నుండి అరూర్ స్టేజి వరకు గుంతలమయమైన బిటి రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలని అనేక సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర జరుగుతుందని తెలిపారు. ఈ పాదయాత్ర ఈనెల 23 న రామన్నపేట లో ప్రారంభమై ఏప్రిల్ 22 న భువనగిరి లో ముగుస్తుందని వారు అన్నారు. ఈ సమావేశానికి మండల కమిటీ సభ్యులు కల్కురి రామచందర్ అధ్యక్షతన జరుగగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు సిర్పంగి స్వామి, మండల కమిటీ సభ్యులు కూర శ్రీనివాస్, వాకిటి వెంకట్ రెడ్డి, మొగిలిపాక గోపాల్, కందాడి సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.